మన్యం మనుగడ కరకగూడెం: సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా నేడు కరకగూడెం మండల పరిధిలోని ప్రాథమిక వైద్యశాలలో రోగులకు పాలు పండ్లు బ్రెడ్ ప్యాకెట్లు ఎంపీపీ రేగా కాళికా బూర్గంపాడు వ్యవసాయ కమిటీ వైస్ చైర్మన్ కొమరం రాంబాబు, మండల అధ్యక్షులు రావుల సోమయ్య గౌడ్ అధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు ,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ఆదేశాల మేరకు కరకగూడెం ప్రథామిక క పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రధాత అన్ని వర్గాల పెన్నిధి సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా మండల కేంద్రంలో అన్ని గ్రామాలలో మూడు రోజులపాటు కార్యక్రమాలు జరుపుతున్నమని వారు అన్నారు. దినిలో భాగంగానే ఈరోజు కరకగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లు పాలు బ్రెడ్ ప్యాకెట్ లు పంపిణీ చేసినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో బూర్గంపాడు వ్యవసాయ కమిటీ వైస్ చైర్మన్ కొమరం రాంబాబు సర్పంచులు పాయం నరసింహారావు,పోలెబోయిన నర్సింహరావు,కొమరం విశ్వనాథం, ఇర్ప.విజయ్ కుమార్,యువజన విభాగం అధ్యక్షులు గుడ్ల రంజీత్ కుమార్, ప్రధాన కార్యదర్శి, కాటుకోజ్వల దీలిప్ కుమార్,మహిళల మండలి అధ్యక్షురాలు కాసు లావణ్య సోషల్ మీడియా అధ్యక్షులు చిట్టిమల్ల ప్రవీణ్ రేగా సత్యనారాయణ జట్ల సత్యం దాసరి సాంబశివరావు కల్లూరి బాలయ్య తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: