మన్యం టివి దుమ్మగూడెం::
దుమ్ముగూడెం మండలం లచ్చిగూడెం గ్రామంలో గత 2 రోజులక్రితం అగ్నిప్రమాదం లో సర్వము కోల్పోయిన బాధిత కుటుంబాన్ని టిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి,నియోజకవర్గ ఇంచార్జ డాక్టర్.తెల్లం వెంకట్రావు పరామర్శించి పార్టీ తరుపున అన్నివిధాలా అండగా ఉంటామని, ప్రభుత్వం ద్వారా రావాల్సిన పథకాలను అందేవిధంగా చూస్తామని హామీ ఇచ్చారు.బియ్యం,నిత్యావసరాలు,వంటసామాగ్రి,తో పాటు రూ 3000 నగదును బాధిత కుటుంబానికి అందించారు.ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి కణితి రాముడు, అధికారప్రతినిది Md. జానీపాషా, సర్పంచ్ ఇర్పా చంటి,ఉపాధ్యక్షులు అపక వీర్రాజు,యువకులు చిన్నయ్య, రాముడు, మల్లేష్,రాకేష్,గణేష్,భద్రయ్య తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: