CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఘనంగా ప్రారంభమైన ఇల వేల్పుల సమ్మేళనం.

Share it:

 


మన్యం మనుగడ ఏటూరు నాగారం

ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారక్క జాతర సన్నిధిలో కోయ గిరిజనుల ఇలవేల్పుల సమ్మేళనం కోయ తెగ పెద్దలు, పూజారులు,ఆర్తివారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది.బుధవారం ప్రారంభమై 4వ తేదీ ముగు స్తుందని కోయల్లో మూడు,

నాలుగు,ఐదు,ఆరు,ఏడు గొట్టు గోత్రాల వారు ఉంటారని,ఈ గోత్రాల వారికి వంశ మూల పురుషులు,స్త్రీలు ఉంటారు. వారిని తమ ఇష్ట దైవాలుగా కోయలు పూర్వం నుండి నేటికి కోలుస్తూన్నారు.ప్రకృతిలో కాలానికి అనుగుణంగా దొరికే పండ్లు,ఫలాలను ఆయా రుతువుల్లో తమ వేల్పులకు నైవేద్యంగా సమార్పించిన తరువాతనే కోయలు స్వీకరించే ఆచారం నేటికి కనిపిస్తుందని, ఇలా ప్రతి గోత్రం వారు ప్రతి సంవత్సరం వేల్పుల పండు గలను మాఘమాసం నుండి చైత్ర మాసం వరకు నిర్వహించు కుంటారని,గోత్రాల వారీగా ఉన్న ఇలవేల్పులకు చరిత్ర కలిగి ఉంటారని,కోయలు వారిని స్మరించుకుంటూ డోలు వాయిద్యాలతో చరిత్రలు,

పురాణాలు,వీర గాథలు,రేల పాటలు తో మౌఖికంగా చెపుతున్నారని,ఈ యొక్క గోత్రాల చరిత్రలను,వారియొక్క ఆచార సంప్రదాయాలను తమ ముందు తరాల వారికి,

అందించే ప్రయత్నమే ఈ ఇల వేల్పుల సమ్మేళనం.ఈ యొక్క సమ్మేళనంకు ఆయా గొట్టులకి సంబంధించిన వేల్పులు దూళి ముత్తి,భీమరాజు,ఘడికమ రాజు,నంగ రాజు,బాపనమ్మ, పడిగిద్ద రాజు,పిడగరాజు,

నాగులమ్మ,రెక్కల రాము,రణ సూరుడు,గోవిందరాజు, చిర్రాజులు వేల్పులు వచ్చి ఉన్నాయి.ఈ సమ్మేళనంకు మేడారం పూజారుల సంఘం అధ్యక్షులు సిద్దబోయిన జగ్గారావు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చేర్ప రవీందర్,పేసా కో ఆర్డినేటర్ కొమరం ప్రభాకర్,భద్రాద్రి జిల్లా పేసా కోఆర్డినేటర్ కొమరం అనిల్ కుమార్,అసిస్టెంట్ మ్యూజియం క్యూరేటర్ కురసం రవి,కొమురం అనిల్ కుమార్,హై కోర్ట్ న్యాయవాది సొడే వెంకట్,ఐటీడీఏ ఉద్యోగి పెనక ప్రభాకర్,రీసెర్చ్ స్కాలర్ మహేష్,ఆదివాసి పెద్దలు మహిళలు యువతీ యువకుల తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: