మన్యం టీవీ న్యూస్ : జూలూరుపాడు, ఫిబ్రవరి 11, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండలం లో శుక్రవారం జరిగిన పలు కార్యక్రమాలలో మాజీ పార్లమెంట్ సభ్యులు టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. బేతాళపాడు గ్రామంలో గుగులోత్ మోహన్ కుమార్తె సంధ్య,ఇంద్రలాల్ వివాహం సందర్భంగా దంపతులను ఆశీర్వదించి నూతన వస్త్రాలను అందజేశారు. అదే గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న సీనియర్ నాయకులు బొడ్డు కృష్ణయ్య కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. గురవాగు తండాలో రాజేష్ కుమార్, సుప్రియల వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి పట్టు వస్త్రాలను బహుకరించారు. కాకర్ల ఎస్సీ కాలనీలో వెంకటేష్, ప్రమీల వివాహ రిసెప్షన్ లో పాల్గొని నూతన జంటను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జూలూరుపాడు సొసైటీ చైర్మన్ లేళ్ళ వెంకటరెడ్డి, ఎంపీపీ లావుడ్యా సోనీ,వెంగన్నపాలెం ఎంపీటీసీ దుద్దుకూరు మధుసూదనరావు,లేళ్ళ గోపాలరెడ్డి, నరేష్, రాందాస్, రాంబాబు, నాగరాజు, శ్రీనాధ రాజు, రామిశెట్టి నాగేశ్వరరావు, నాగయ్య, రామకృష్ణ, భద్రయ్య, వెంకటనారాయణ, ముత్తయ్య, పుప్పాల నరసింహారావు అల్లడి లింగారావు, చలమల నరసింహారావు, వెంకయ్య తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: