మణుగూరు ఎక్సైజ్ సీఐ రామ్మూర్తి
మన్యం టీవి న్యూస్, మణుగూరు: మాదక ద్రవ్యాలతో యువత తమ జీవితాలను చిత్తు చేసుకోవద్దని అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నియంత్రణ వారోత్సవాల్లో భాగంగా ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యాన అవగాహన కార్యక్రమాన్ని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మణుగూరు నందు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి. శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా మణుగూరు ఎక్సైజ్ సీఐ రామ్మూర్తి మాట్లాడుతూ మాదక ద్రవ్యాల ప్రభావంతో యువత మత్తుకు బానిసలై తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని అన్నారు. ఇటీవల కాలంలో విద్యార్థులు గంజాయి, డ్రగ్స్ కేసుల్లో నేరస్థులుగా మారుతున్నారన్నారు. జల్సాలకు అలవాటు పడిన యువత డబ్బుల కోసం నేరా
లకు పాల్పడి, తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారన్నారు. డ్రగ్స్ కు అలవాటుపడిన వారి మెదడు మొద్దుబారి, తాము ఏమీ చేస్తున్నారన్న విషయాన్ని మరిచిపోయి, విచక్షణ కోల్పోయి, తల్లిదండ్రలను ఎదిరిస్తూ, ప్రేమ పేరుతో బాలికల్ని వేధిస్తూ, పోక్సో కేసుల్లో నేరస్థులుగా మారుతున్నారని వివరించారు. మాదక ద్రవ్యాల వైపు యువత ఎవ్వరూ ఆకర్షితులు కావద్దని, లక్ష్య సాధనకు కషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ జూపూడి అనిల్ కుమార్, అధ్యాపకులు అబ్దుల్ కరీం, బూర్గుల సతీష్, రామ తిరుపతి అధ్యాపకులు పాల్గొన్నారు.
Post A Comment: