గుండాల /ఆళ్లపల్లి ఫిబ్రవరి 14 (మన్యం మనుగడ) ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు పర్యటనను విజయవంతం చేయాలని ఆళ్ల పల్లి ఎంపీపీ కోండ్రు మంజు భార్గవి విజ్ఞప్తి చేశారు. సోమవారం మండల కేంద్రంలోని రెండు పలకల గృహ సముదాయాలను ఆమె పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మంగళవారం మండలంలో రేగా పర్యటన ఉన్నందున ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమాలు టిఆర్ఎస్ పార్టీ అధ్యక్ష కార్యదర్శులు పాయం నరసింహారావు, ఎస్.కె బాబా, కోపరేటివ్ చైర్మన్ రామయ్య , కిషోర్ బాబు, వెంకన్న తదితరులు పాల్గొన్నారు
Post A Comment: