మన్యం టీవి న్యూస్,అశ్వాపురం:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం గొల్లగూడెం గ్రామానికి చెందిన విద్యావంతుడు ఇల్లుటూరి మహేష్ ను ఉద్యోగ జేఏసీ పినపాక నియోజకవర్గ కన్వీనర్ గా నియమిస్తూ నియామక పత్రం అందజేస్తున్న మాదిగ జేఏసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు సిద్దెల తిరుమల రావు. 12 శాతం రిజర్వేషన్ సాధనకై జనాభా దామాషా ప్రకారం మాదిగ జేఏసి వ్యవస్థాపకులు ఎస్సీ కార్పొరేషన్ రాష్ట్ర మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి ఆదేశాల మేరకు సంఘం బలోపేతం కోసం కృషి చేయాలని కోరారు . ఈ అవకాశం కల్పించిన అటువంటి మాదిగ జేఏసి వ్యవస్థాపకులు పిడమర్తి రవి కి రాష్ట్ర కన్వీనర్ కోడారి. దిరన్, రాష్ట్ర ప్రచార కార్యదర్శి గద్దల నాగేశ్వర రావు, మాదిగ జేఏసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు సిద్దెల తిరుమలరావు కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కత్తి సాలయ్య, ఏర్పుల కిరణ్ , పల్లెపొంగు గురుసాయి పురుషోత్తం వెంకట్ కత్తి ఉప్పలయ్య తదితరులు పాల్గొన్నారు..
Post A Comment: