CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

అమలుకు నోచుకోని పెసా చట్టం.

Share it:

 



(మన్యం మనుగడ వాజేడు ఫిబ్రవరి 10.)


 చట్టాలు అంటే ఏమిటి. అవి ఎలా తయారుచేస్తారు గిరిజనేతరల చట్టాలు, ఆదివాసీల చట్టాలు, వారి యొక్క సంస్కృతి సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలపై జీవన విధానంలో వ్యవహరిస్తున్న మతాల ఆచారాల ప్రకారం న్యాయస్థానాలు, చట్టాలను తయారు చేస్తారు.

ఆదివాసీలకు ఒక్కొక్క తెగకు ఒక్కొక్క ఆచార సాంప్రదాయాలు ఉంటాయి. ఆదివాసీలకు ప్రత్యేకమైన మతం ఉండదు ప్రకృతిని దేవునిగా పూజిస్తారు. లిఖితపూర్వకంగా చట్టాలు ఉండవు, ఆదివాసీ ఒక తెగకు ఒక పెద్ద ఉంటారు. ఆయన తీర్పులు చెపుతారు. భారతదేశంలో ఆదివాసులకు రాజ్యాంగంలోని 244 ఆర్టికల్ లో 5,6 షెడ్యూలు ఉన్నాయి ఐదవ షెడ్యూల్ పది రాష్ట్రాలు ఉన్నాయి వీటిలో ప్రధానంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, చత్తీస్గడ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్ ,మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ,ఒడిషా ,రాజస్థాన్ ,


ఆరవ షెడ్యూల్ ప్రాంతాలు అస్సాం, త్రిపుర ,మేఘాలయ, నాగాలాండ్, ఈ రాష్ట్రాలలో ఆదివాసులకు స్వయంపాలన కల్పించబడ్డాయి. ఐదవ షెడ్యూల్ లో ఉండే రాష్ట్రాలకు పెసా చట్టం కల్పించబడింది. ఆరవ షెడ్యూల్ రాష్ట్రాలకు జిల్లా అటానమస్ కౌన్సిల్ కల్పించబడ్డాయి. ఈ చట్టం ద్వారా తయారు చేసేటటువంటి చట్టాలు పార్లమెంటు చట్టాలతో సమానం. 1994వ సంవత్సరంలో 73వ రాజ్యాంగ సవరణ తీసుకు వచ్చినప్పుడు పంచాయతీ రాజ్ చట్టం చేయడం జరిగింది ఈ చట్టం, కేవలం మైదాన ప్రాంత పరిపాలన కొరకు తయారు చేయడం జరిగింది. తర్వాత రెండు సంవత్సరాలకు కేంద్ర ప్రభుత్వం 1996 సంవత్సరం లో షెడ్యూల్ ప్రాంత పంచాయతీ రాజ్ చట్టం తయారు చేశారు. ఇది ఆదివాసుల యొక్క పవిత్ర గ్రంథం లాంటిది. పెస చట్టం లో 16 భాగాలు ఉన్నాయి. పెసా చట్టంని పాలక ప్రభుత్వాలకు అమలు చేయడం లేదు, అందులోని అంశాలను మార్పులు చేసి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు అనుకూలంగా తయారు చేసుకుంటున్నాయి. వాస్తవంగా అందులోని అంశాలను చదివి అర్థం చేసుకుంటే సర్వ అధికారాలు ఏజెన్సీ ప్రాంతాలలో ఉంటాయి. పార్లమెంట్లో తయారుచేసిన చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తూట్లు పొడుస్తున్నారు.

ఆదివాసి చట్టాల అమలు బాధ్యత ఎవరు నిర్వహిస్తారని పలువురు ఆదివాసీ నాయకులు, ప్రభుత్వాన్ని, పాలకవర్గాన్ని అధికారులని, ప్రశ్నించిన ఫలితం శూన్యం. పెసా చట్టం అమలు పాలక ప్రభుత్వలు తుంగలో తొక్కుతున్నాయి. పెసా చట్టం ఎక్కడ అమలు అవుతుంది అంటే? ఆదివాసీల సంపదను దోచుకోవడంలో బ్రహ్మాండంగా అమలు జరుపుతుంది. ఆదివాసీలను తాగుబోతులుగా తయారు చేయడంలో అమలు జరుపుతుంది. 

ఆదివాసీల సాంస్కృతికి, సాంప్రదాయాలకు ప్రతిరూపంగా భావించే చట్టo నిర్వీర్యం చేస్తున్నటువంటి అధికారులపై చర్యలు తీసుకోకపోవడం పై అమలవుతుంది అని ఆదివాసీ సంఘాలు ఆరోపిస్తున్నాయి.

పెసా చట్టాన్ని పాలక ప్రభుత్వాలు, తమ బాధ్యతగా తీసుకొని చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు తావు ఇవ్వకుండా చట్టాన్ని పరిరక్షించాలని, ఫిఫ్త్ షెడ్యూల్ ప్రాంతాన్ని, ఆదివాసీలను, ప్రజలను, రక్షించవలసిన బాధ్యత ప్రభుత్వానిదే అని ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ జిల్లా ఉపధ్యక్షులు.చింత సోమరాజు సూచించారు.

Share it:

TS

Post A Comment: