మన్యం మనుగడ మంగపేట.
సోమవారం 14.02.2022 బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా కమిటీ ఆదేశాల మేరకు ములుగు జిల్లా మంగపేట మండలంలోని రాజుపేట గ్రామంలో ముఖ్యకార్య కర్తల సమావేశం ఏర్పాటుచేయడం జరిగింది.ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా జిల్లా ఇంచార్జీ శనిగరపు నరేష్,విశిష్ట అతిధిగా జిల్లా అధ్యక్షులు పరికిపవన్ తేజ హాజరైనారు . ఈ సమావేశాన్ని ఉద్దేశించి జిల్లా ఇంచార్జీ శనిగరపు నరేష్ మాట్లాడుతూ తెలంగాణా లో ఎస్సి ఎస్టీ ,బీసీ ,అగ్రవర్ణాల లోని పేదల యొక్క పేదరికం పోవాలంటే డా: ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ నాయకత్వలో ఏనుగు గుర్తుకు ఓటు వేసి బిఎస్పీ పార్టీని గెలిపించాలని తెలియజేశారు.
అనంతరం ఏటూరునాగారం మండలంలోని బిఆర్ ఫంక్షన్ హాల్లో జరిగిన జిల్లా సమావేశంలో డా :ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ సమక్షంలో నూతనంగా బిఎస్పీ పార్టీలో చేరిన గుంటపూడి తిరుమల ను మంగపేట మండల మహిళా కన్వీనర్ గా, కో కన్వీనర్ గా అనసూర్యను,బిఎస్పీ మంగపేట మండల కన్వీనర్లు గా చప్పిడి వెంకటేశ్వర్లు, మరియు గుళ్లగట్టు విజయరావు,రాజుపేట గ్రామ కన్వీనరుగా బుక్యా దొరబాబు తదితరులను జిల్లా అధ్యక్షులు పరికి పవన్ తేజ గ నియమించి బాధ్యతలు అప్పగింవచడం జరిగింది.
ఈ కార్యక్రమంలో బి ఎస్పీ ములుగు జిల్లా ఆర్గనైజింగ్ సెక్రెటరీ ఎంపెళ్లి వీరస్వామి, ములుగు అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి కర్నే రమేష్, శ్రవణ్, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: