- ములకలపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా సున్నం నాగమణి జెడ్పీటీసీీీ
మన్యం మనుగడ,ములకలపల్లి:
సభ్యసమాజం తలదించుకునే విధంగా కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ పైన అనుచిత వ్యాక్యాలు చేసిన అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మపై కేసు నమోదు చేయాలని సున్నం నాగమణి జడ్పీటీసీ ములకలపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... దేశం కోసం ప్రాణాలు అర్పించిన భారతరత్న దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ కుమారుడు పార్లమెంట్ సభ్యుడు రాహుల్ గాంధీ పైన అస్సాం సీఎం హిమంత వ్యాక్యాలు సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉన్నాయ
న్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న హిమంత బిశ్వ శర్మ చేసిన వ్యాక్యాలు భారతీయ సంస్కృతిని దెబ్బతీసే విధంగా ఉన్నాయన్నారు. రాజ్యంగం ప్రసాదించిన ఉన్నత పదువుల్లో ఉన్న వారు సమాజానికి మేలు చేయాలే గానీ, ఇటువంటి నీచమైన వ్యాక్యాలు చేయడం తగదన్నారు. హిమంతశర్మ చేసిన వ్యాక్యాలు ఐపిసి సెక్షన్ ప్రకారం కేసు నమోదు చెయ్యాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జ్ , తాండ్ర ప్రభాకర్రావు, , మండల మైనార్టీ సెల్ అధ్యక్షుడు M.D.అంజుము ,పాలకుర్తి రత్నభూషణం ,పుష్పాల హనుమంతు, ఖాదర్ బాబా తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: