CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

పినపాక ఎమ్మెల్యే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ను మర్యాదపూర్వకంగా కలిసిన : మేడా విజయ్ కుమార్.

Share it:

 



నామినేటెడ్ పదవుల్లో సముచిత స్థానం కల్పించాలని మేడా విజయ్ కుమార్ భద్రాద్రి కొత్తగూడెం సింగరేణి క్లబ్ లో కొత్తగూడెం తెరాస జిల్లా అధ్యక్షుడు పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావును మర్యాదపూర్వకంగా కలిసిన టిఆర్ఎస్ ఖమ్మం ఉమ్మడి జిల్లా నాయకులు మేడా విజయ్ కుమార్ . గతంలో ఖమ్మం ఉమ్మడి జిల్లాలో టిఆర్ఎస్ లో బలంగా పని చేసామని , కొత్త కృష్ణా రెడ్డి , కంచర్ల చంద్రశేఖరరావు ఆధ్వర్యంలో కేసీఆర్ ఆదేశాల మేరకు అనేక పోరాటాలు కూడా చేయడం జరిగిందని , రేగా కాంతారావుకు మేడా విజయ్ కుమార్ వివరించారు . ఎస్టీ కార్పొరేషన్ లో గానీ , ఎస్టీ ట్రైకార్ లోగాని సముచిత స్థానం కల్పించాలని కోరారు . తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గిరిజనుల పక్షపాతి అని , తమకు కచ్చితంగా న్యాయం జరుగుతుందని అన్నారు . ఎరుకల కులానికి చెందిన తమకు రాష్ట్ర రాజకీయాల్లో కూడా స్థానం కల్పించాలని , అందుకు మీ వంతుగా కృషి చేయాలని రేగా కాంతారావు కు మేడా విజయ్ కుమార్ కోరారు . అందుకు రేగా కాంతారావు స్పందిస్తూ తమ వంతుగా కచ్చితంగా న్యాయం చేస్తామని మేడా విజయ్ కుమార్ హామీ ఇచ్చారని తెలిపారు .

Share it:

TS

Post A Comment: