CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

కెసిఆర్ భారత రాజ్యాంగాన్ని మార్చాలని మాట్లాడడం సిగ్గుచేటు.రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తే సహించం..

Share it:


 

  • కెసిఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలి. 
  • ములుగు జిల్లా దళిత మోర్చా
  • అద్యక్షలు కావిరి అర్జున్.

మన్యం మనుగడ ఏటూరు నాగారం

బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపు మేరకు దళిత మోర్చా ఆధ్వర్యంలో ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలో మండల అధ్యక్షు లు కావిరిసంతోష్,దళిత

మోర్చా అధ్యక్షుడు బౌతు రామకృష్ణ ఆధ్వర్యంలో భీమ్ దీక్ష చేపట్టారు.అలాగే కేసీఆర్ దిష్టి తగల పెట్టారు.ఈకార్య

క్రమనికి ముఖ్య అతిథిగా ములుగు జిల్లా ఎస్సి మోర్చా అధ్యక్షులు కావిరి అర్జున్ హాజరై మాట్లాడుతూ.భారత రాజ్యాంగ బద్దంగా ఎన్నికై ముఖ్యమంత్రిగా విధులు నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్ భారత రాజ్యాంగాన్ని మార్చాలని అనడాన్ని కండిస్తూ ఈ సందర్భంగా స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్నా భారత రాజ్యాంగం ఇప్పటికీ ముందస్తుగానే ఉందని పేర్కొన్నారు.భారత రాజ్యాంగంలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆర్టికల్ 3 పొందుపర్చినందుకే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిందని అన్నారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనందుకే తెలంగాణ రాష్ట్రం ముఖ్య మంత్రి అయ్యారని గుర్తించుకోవాలని అన్నారు.రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛ వలన ఈ రోజు మీరు ఈ విధంగా మాట్లాడుతున్నా రని మండిపడ్డారు.డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎంతో కష్టపడి ప్రపంచంలో ఎక్కడలేని విధంగా ప్రజాస్వామ్యం వర్ధిల్లే విధంగా ఈ దేశానికి రాజ్యాంగాన్ని రూపొందించి దేశానికి దశ దిశ నిర్దేశించారని పేర్కొన్నారు. రాజ్యాంగ బద్ధంగా ఎన్నికైన కొంతమంది స్వార్థపరులు రాజ్యాంగ హక్కులను కాలరాస్తున్నారని అన్నారు. ప్రపంచ దేశాలు మొత్తం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వైపు చూస్తుంటే అగ్రవర్ణ భావజాలం తో విషం కక్కుతున్నారని, మండి పడ్డారు.రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తే ఎంతటి వారినైనా సహించేది లేదన్నారు.ఇప్పటికైనానీ తప్పు తెలుసుకుని భారత సమాజా నికి బహిరంగ క్షమాపణ చెప్పాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ను డిమాండ్ చేస్తున్నామని అన్నారు.

లేనియెడల తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.ఈ కార్య క్రమంలో బీజేపీ జిల్లా నాయకులు జాడి రామరాజునేత,మండల ప్రధాన కార్యదర్శి కుమ్మరి సత్యం,మహిళమోర్చా

అధ్యక్షురాలు దుర్గం సమ్మక్క, కిసాన్ మోర్చా అధ్యక్షుడు బుద్ధే తిరుపతి జనగం దుర్గారావు,కావిరి చిరంజీవి,

ఎస్సి మోర్చా జిల్లా కార్యదర్శి సోదరి దుర్గారావు,హోటల్ సత్యం,దళిత బహుజన నాయకులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: