గుండాల ఫిబ్రవరి 3 ( మన్యం మనుగడ) హరితహారం పేరుతో ఫారెస్ట్ అధికారులు పోడు భూముల ఆక్రమణ నిలిపివేయాలని న్యూడెమోక్రసీ జిల్లా నాయకులుపరిష్కా రవి డిమాండ్ చేశారు. గురువారం మండల పరిధిలోని కాచన పల్లి గ్రామంలో అటవీ అధికారులు కందకాలు తీయడం కోసం తీసుకు వస్తున్న జెసిబి లను అడ్డుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత నలభై సంవత్సరాల నుండి తోడు చేసుకొని వ్యవసాయం చేస్తున్న భూములను హరితహారం పేరుతో ఇప్పుడు తీసుకోవడం ఎంతవరకు సమంజసమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పోడు భూములకు పట్టాలు ఇస్తామని దరఖాస్తులు తీసుకుంటే ఫారెస్ట్ అధికారులు అదే భూములను తీసుకోవడం ఎంతవరకు సమంజసమన్నారు. ఎన్నో ఏండ్లుగా చేసుకుంటున్న పోడు భూములు జోలికి రావద్దని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో న్యూ డెమోక్రసీ నాయకులు పునెం రంగన్న , ఎనుగంటి రమేష్ , ఎనుగంటి చిరంజీవి, బొమ్మెర వీరన్న, పూనెం సత్యం, తదితరులు పాల్గొన్నారు
Post A Comment: