మన్యం టివి న్యూస్ దమ్మపేట ఫిబ్రవరి ( 02 ) బుధవారం ;- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
దమ్మపేట
అఖిల భారత రైతు సంఘం ఎ.ఐ.కే.యస్. దమ్మపేట మండల మహాసభ కుక్కలగుంట సత్యనారాయణ పండూరి వీరబాబు వీరలక్ష్మి అధ్యక్షున జరిగింది మహాసభలో మాట్లాడుతున్న రైతు సంఘం జిల్లా వర్కింగ్ కార్యదర్శి చంద్ర నరేంద్ర కుమార్ సి పి ఐ రాష్ట్ర సమితి సభ్యులు ఎస్ డి సలీం జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం వర్కింగ్ కార్యదర్శి యార్లగడ్డ భాస్కరరావు మాట్లాడుతూ దేశంలో రాష్ట్రంలో రైతులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను చిన్నచూపు చూస్తున్నాయని రైతు లేనిదే రాజ్యం లేదని రైతే ఈ దేశానికి వెన్నుముక అని ఊక దంపుడు ఉపన్యాసాలు చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో వైఫల్యం చెందారని రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తీసుకొచ్చి రైతులకు ప్రజలకు క్షమాపణ చెప్పిన ఒకే ఒక ప్రధానమంత్రి నరేంద్ర మోడీని రైతులు కావాల్సింది క్షమాపణ కాదని రైతులకు గిట్టుబాటు ధర రైతులను అన్ని రకాలుగా ఆదుకోవాలని 136 కోట్ల ప్రజలకు అన్నం పెట్టే రైతు ని అనేక ఇబ్బందులకు గురి చేస్తున్న రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మట్టి ఖర్చుకు పోతాయని నిన్న ప్రవేశ పెట్టిన బడ్జెట్లో రైతులకు తీరని అన్యాయం జరిగిందని తక్షణం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు ఉచితంగా ఎరువులు పురుగుమందులు వడ్డీలేని బ్యాంకు రుణాలు అందించాలని కౌలు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని అనేకమంది వేరుశనగ పత్తి మిరప వివిధ పంటలు వేసిన రైతులు వేలాదిగా ఉన్నారని రైతులందరూ అప్పుల ఊబిలో కూరుకుపోయారు అని తక్షణం నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర సమితి సభ్యురాలు బెల్లం కృష్ణవేణి బి కే ఎం యు మండల కార్యదర్శి కొర్స వెంకటేష్ ఏ ఐ వై ఎఫ్ జిల్లా నాయకులు సుంకు పాక ధర్మ ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు బత్తుల సాయి గిరిజన సంఘం నాయకురాలు పదం విజయలక్ష్మి మహిళా సంఘం నాయకురాలు దండి శాంతి ఏఐటీయూసీ నాయకులు నల్ల ప్రసాద్ దళిత హక్కుల పోరాట సమితి నాయకులు బుడుపుల శ్రీను మైనార్టీ ముస్లిమ్స్ కమిటీ ఈసఫ్ జిల్లా నాయకులు ఎస్కే దస్తగిరి రైతులు పరేపల్లి ప్రసాదు గుజ్జుల శ్రీను బాబ్జి వీరేందర్ తిరువీధుల శ్రీను రైతు నాయకులు రైతులు పాల్గొన్నారు
Post A Comment: