గుండాల/ఆళ్లపల్లి ఫిబ్రవరి 15 (మన్యం మనుగడ) పేదవాడు ఆత్మగౌరవంతో జీవించాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రెండు పడకల గృహ సముదాయాలలో నిర్మించిందని ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. మంగళవారం మర్కోడు గ్రామంలో రెండు కోట్ల రూపాయలతో నిర్మించిన 40 ఇండ్లను లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక చేసి లబ్ధిదారులకు అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని అందులో ముఖ్యంగా రెండు పడకల గృహ సముదాయాలను లక్షల రూపాయలు వెచ్చించి నిర్మించనున్నారు. ప్రతిపక్ష పార్టీలు అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రభుత్వం పై బురదజల్లే కార్యక్రమం చేస్తుందన్నారు. దేశంలో ఎక్కడలేని విధంగా కళ్యాణ లక్ష్మి , షాదీ ముబారక్, రైతుబంధు, ఇస్తుందన్నారు. ఏ రాష్ట్రం ఇవ్వనంత వృద్ధాప్య పింఛన్ వితంతు పింఛన్లను ఇస్తుందన్నారు. అభివృద్ధి చేస్తున్న టిఆర్ఎస్ పార్టీని ముఖ్యమంత్రి కేసీఆర్ ని గుర్తుంచుకోవాలని ప్రతిపక్ష పార్టీలు చెప్పే తప్పుడు ఆరోపణలు నమ్మవద్దని టిఆర్ఎస్ పార్టీకి ముఖ్యమంత్రి కేసీఆర్ కు అండగా నిలవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ శంకర్ బాబు, జెడ్ పి టి సి హనుమంతరావు, ఎంపీపీ కోండ్రు మంజు భార్గవి, తాసిల్దార్ రజియా సుల్తానా, ఎంపీడీవో మంగమ్మ, సొసైటీ చైర్మన్ రామయ్య , మార్కెట్ కమిటీ డైరెక్టర్ లింగయ్య , టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు నరసింహారావు, ప్రధాన కార్యదర్శి బాబా, ఉపాధ్యక్షులు వెంకటేశ్వర్లు , సర్పంచులు ,ఎంపీటీసీలు పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు
Post A Comment: