మన్యం టీవీ న్యూస్ : జూలూరుపాడు, ఫిబ్రవరి 9, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండల పరిధిలోని బేతాళపాడు గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ బట్టు పాపయ్య బుధవారం మధ్యాహ్నం తన స్వగ్రామమైన చీపురు గూడెం లో కన్నుమూశారు. బేతాళ పాడు గ్రామ పంచాయతీ సర్పంచ్ గా సుదీర్ఘ కాలం సేవలందించారు. విషయం తెలుసుకున్న జూలూరుపాడు సొసైటీ చైర్మన్ లేళ్ళ వెంకటరెడ్డి, వెంగన్న పాలెం ఎంపీటీసీ దుద్దుకూరు మధుసూదన్ రావు భౌతిక దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
Navigation
Post A Comment: