మన్యం మనుగడ మంగపేట.
భారత రాజ్యాంగాన్ని మార్చాల్సిన అవసరం ఉంది అని వాఖ్యానించిన కేసీఆర్ పై దేశ ద్రోహం కేసు నమోదు చేయాలి. మతిస్థిమితం తప్పి మాట్లాడుతున్న కేసీఆర్ ను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మంద క్రిష్ణ మాదిగ డిమాండ్ మేరకు
మంగపేట మండలం లో ఎమ్మార్పీఎస్ ఎమ్మెస్పి మండల ఇంచార్జి గుగ్గిళ్ల సురేష్ మాదిగ అద్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమం లో భారత రాజ్యాంగనిర్మాత డా:అంబేద్కర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేసి పూల దండలతో అలంకరించటం జరిగింది. ఈ సందర్బంగా ఎమ్మార్పిఎస్, ఎమ్మెస్పి నాయకులు సురేష్ గుగ్గిళ్ల మాదిగ మాట్లాడుతూ భారత రాజ్యాంగం లోని ఆర్టికల్ 03 ద్వారా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందనే కనీసం అవగాహన లేకుండా కేసీఆర్ మాట్లాడడం అహంకార పూరిత ధోరణికి నిదర్శనమని
ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం రోజున కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వసం విధేయత చూపుతానని రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికి న్యాయం చేకూరుస్తానని ప్రమాణం చేసి భారత రాజ్యాంగం పట్ల విశ్వాసం విధేయత చూపకుండా రాజ్యాంగాన్నే మార్చాలని మాట్లాడిన మీకు ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత లేదు అని ఎమ్మార్పీఎస్ ఎమ్మెస్పి మంగపేట మండల ఇంఛార్జి గుగ్గిళ్ల సురేష్ మాదిగ ఈ సందర్బంగా అన్నారు.భారత రాజ్యాంగాన్ని అవమానించిన కేసీఆర్ ఎస్సి, ఎస్టీ,బీసీ,ముస్లిం మైనారిటీ సమాజానికి క్షమాపణ బహిరంగంగా చెప్పాలి.ముఖ్యమంత్రి గా కొనసాగే కనీస అర్హత మీకు లేదని వెంటనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని ప్రజల పక్షాన ప్రజాస్వామ్యబద్ధంగా డిమాండ్ చేస్తున్నాం.కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని లేని పక్షంలోలో భవిష్యత్ లో రాజకీయంగా కేసీఆర్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో ఎమ్మార్పీఎస్,ఎమ్మెస్పి నాయకులు మాదిగ నైనరపు కేశవులు మాదిగ, సంతోష్ మాదిగ,ఎమ్మార్పీఎస్ , మండల నాయకులు మందపెళ్లి సతీష్ మాదిగ,ఎమ్మార్పీఎస్ గ్రామ కమిటీ ప్రధాన కార్యదర్శి లంజపెళ్లి ఆదినారాయణ మాదిగ,గుగ్గిళ్ల మహేష్ మాదిగ, దాసరి సతీష్ , దాసరి చంటి,దాసరి శ్యామ్ బాబు,లంజపెళ్లి వెంకటేశ్వర్లు మాదిగ కిసరి సారయ్య మాదిగ,గుండెట్టి చంటి మాదిగ, శ్రీరాములు మాదిగ, తదితరులు చేయడం జరిగింది.
Post A Comment: