మన్యం మనుగడ మంగపేట.
ములుగు జిల్లా మంగపేట మండలం రాజపేట గ్రామంలోని ప్రభుత్వ హైస్కూల్ పాఠశాలో అపోలో మెడికల్ షాప్ వాలాద్రి శ్రీనివాస్ రెడ్డి సహకారంతో మానవ సేవ యూత్ ఆధ్వర్యంలో వాలాద్రి శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా మాస్కులు, శానిటైజర్ హ్యాండ్ వాష్ లను పంపిణీ చేశారు.ఈ సందర్బంగా మానవ సేవ యూత్ వ్యవస్థాపక అధ్యక్షుడు రామ్మోహన్ మాట్లాడుతూ కరోనా సమయంలో విద్యార్థులు తగు జాగ్రత్తలతో పాఠశాలకు క్రమం తప్పకుండా రావాలని విద్యను ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకుండా కొనసాగించాలని కరోనా తీవ్ర సమయంలో ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన ఆన్లైన్ క్లాసులు ద్వారా పిల్లలు క్రమం తప్పకుండా విద్యాభ్యాసం కొనసాగించాలి. క్రమం తప్పకుండా క్రమశిక్షణతో విద్యాభ్యాసం చేసినప్పుడే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు ఎదగగలరు అని ఆయన విద్యార్థుల్ని ఉద్దేశించి అన్నారు.ఈ కార్యక్రమంలో లో మానవ సేవ యూత్ ప్రధాన కార్యదర్శి చౌలం వేణు, కోశాధికారి,బోడ ప్రవీణ్ కుమార్ ,డాక్టర్ నాగేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: