CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

వాజేడు ఏజెన్సీ ప్రాంతంలో బహుళ అంతస్థుల నిర్మాణాలు అడ్డగోలుగా నిర్మిస్తున్నారు. అడ్డు ఎవరు?.

Share it:

 



  • పిఫ్త్ షెడ్యూల్ ప్రాంతంలో ఆదివాసి చట్టాలకు తూట్లు. 
  • ఏజెన్సీలో 1/59,1/70 ,ఎల్ టి ఆర్ చట్టాలు ఉన్నట్టా లేనట్టా.
  • ఆదివాసి చట్టాలకు ఆదివాసి అస్తిత్వానికి రక్షణ ఎవరు.
  • చట్టాలకు రక్షణ కల్పించవలసిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నరు. రక్షించేది ఎవరు.
  • అడ్డు అదుపు లేకుండా అక్రమ నిర్మాణాలు.. అధికారులేం చేస్తున్నారు..!


మన్యం మనుగడ వాజేడు:


ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలోని ఎక్కడ చూసినా రెండంతస్తుల అక్రమ భవనాల కట్టడాలు జోరుగా జరుగుతున్నాయి. ఫిఫ్త్ షెడ్యూల్ ప్రాంతంమైన చెరుకూరు, రేగులపాడు, పరిసర ప్రాంతాలలో1/59 1/70 చట్టాలను ఉల్లంఘిస్తూ గిరిజనేతరులు భూములు, క్రయ, విక్రయాలు, బహుళ అంతస్థుల నిర్మాణాలు చేస్తున్నారు. సంబంధిత అధికారులు చోద్యం చూస్తున్నారు.గిరిజనేతరులు క్రయ, విక్రయాలు చేసిన భూముల్ని తక్షణమే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ఆదివాసి నాయకులు, ఆదివాసీ ప్రజలు, ప్రభుత్వాన్ని విన్నవించారు. అసలు ఏజెన్సీలో రెండంతస్తుల కు అనుమతులు లేవు... కానీ కొంతమంది వ్యాపారస్తులు అధికారులను మచ్చిక చేసుకొని ఏజెన్సీలో రెండు అంతస్తుల భవనాలు నిర్మిస్తున్నారు. మండలంలోని చెరుకూరు, ధర్మవరం, పేరూరు, చండ్రుపట్ల, గ్రామాలలో ఎక్కడ చూసినా రెండు అంతస్తుల భవనాలు నిర్మిస్తున్నారు. అంటే సంబంధిత అధికారులు వ్యాపారస్తులు ఇచ్చే ముడుపుల కు లొంగి పోవడం వల్ల భవన నిర్మాణాల కట్టడాలు అధికంగా జరుగుతున్నాయని ఆదివాసి సంఘాలు ఆరోపిస్తున్నారు. ఇలా అక్రమ నిర్మాణం చేసిన వారిపై పంచాయతీ అధికారులు తనిఖీలు చేసి అక్రమ నిర్మాణం కింద నోటీసు ఇవ్వాలి. కానీ అక్రమ నిర్మాణాలు చేపట్టే వారికి నోటీసులు ఇవ్వకుండానే వారితో చేతులు కలిపి అక్రమ కట్టడాలకు ఏజెన్సీలో అధికారుల అండదండగా ఉంటున్నారని ఏజెన్సీ ఆదివాసీలు ఆరోపిస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు జోరుగా జరుగుతున్న పట్టించుకున్న అధికారులు లేరని గిరిజనులు వాపోతున్నారు.ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ ఉన్నతాధికారులు అక్రమభవన నిర్మాణాల నియంత్రణకు చర్యలు చేపట్టాలని ప్రజలు పలు ప్రజా సంఘాలు కోరుతున్నారు.

Share it:

TS

Post A Comment: