CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

జనం మెచ్చిన నాయకుని జన్మదిన వేడుకలు.పండగలా సీఎం కేసీఆర్ గారి జన్మదిన వేడుకలు.

Share it:

 


మన్యం మనుగడ, మణుగూరు


 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులతో కలిసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు, టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు కేక్ కటింగ్ చేసి ఘనంగా సంబరాలు నిర్వహించడం జరిగింది.

 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సీఎం కేసీఆర్‌ జన్మదిన వేడుకలు ప్రచంచ వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయని అన్నారు. టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు, మూడు రోజుల పాటు సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్నామన్నారు.నాడు తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపి ప్రాణ త్యాగానికి సైతం సిద్ధపడ్డ నేత సీఎం కేసీఆర్‌ అన్నారు.చావు అంచులకి వెళ్లి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి అన్ని రంగాలలో రాష్ట్రాన్ని నేడు ప్రగతి పథంలో నడిపిస్తున్నారని ప్రశంసించారు.సంక్షేమంలో,అభివృద్ధి లో తెలంగాణ ను దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్న సీఎం కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని మరో 20 ఇరవై ఏండ్లు కేసీఆర్ గారే, టిఆర్ఎస్ ప్రభుత్వమే ఉండాలని ప్రజలు కోరుకుంటున్నట్లు తెలిపారు. మణుగూరు మండలం ముత్యాలమ్మ నగర్ గ్రామపంచాయతీ సంతోష్ నగర్ గ్రామంలోని బాల వెలుగు అనాధాశ్రమంలో సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి, విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ముత్యాలమ్మ నగర్ పంచాయతీ నందు సీఎం కేసీఆర్ జన్మదినం పురస్కరించుకొని ఫారెస్ట్ అధికారులు, ప్రజా ప్రతినిధుల కార్యకర్తలు నాయకులతో కలిసి, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా పలు రకాల మొక్కలు నాటడం జరిగింది.

ఈ కార్యక్రమంలో మణుగూరు మండల టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పార్టీ ముఖ్య నాయకులు, తదితరులు పాల్గొన్నారు. 

Share it:

TS

Post A Comment: