మన్యం టివి దుమ్మగూడెం:
భద్రాచలం శాసనసభ్యులు పొదెం వీరయ్య మండలంలో మారుమూల గ్రామాల్లో పర్యటించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఈ పర్యటనలో నల్లబెల్లి ,కే లక్ష్మీపురం, గౌరారం, పైడి గూడెం, లింగాపురం గ్రామాల్లో పర్యటించి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు చేయించారు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం పొందిన కార్యకర్తలకు సభ్యులకు దురదృష్టవశాత్తు ఏదైనా ప్రాబ్లం మరణిస్తే కాంగ్రెస్ పార్టీ ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు అని తెలిపారు. నల్లబెల్లి సమ్మయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో గ్రామస్తులు అధిక సంఖ్యలో వచ్చి పలు సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి తెలియజేశారు. ఈ పర్యటన సందర్భంగా గ్రామంలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ఏజెన్సీ ఆదివాసీ గిరిజన సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు అసలు ఆదివాసీల మీద ఈ ప్రభుత్వానికి ప్రేమ లేదని అన్నారు.మారుమూల గ్రామాల్లో మిషన్ భగీరథ నీరు అందడం లేదని డబుల్ బెడ్ రూమ్ లో అందని ద్రాక్ష గా మారిందని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు శ్రీనివాసరావు, బైరెడ్డి సీతారామారావు ,రంగారావు, కనితి సమ్మయ్య, దేవా ,తెల్లం హరి పెద్దలు గ్రామస్తులు పాల్గొన్నారు
Post A Comment: