మన్యం మనుగడ ప్రతినిధి, బూర్గంపాడు:ఈ నెల 17వ తేదీన తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత, ఉద్యమ నేత,ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదినం సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు మూడు రోజుల కార్యక్రమాల్లో భాగంగా,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక శాసనసభ్యులు,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ఆదేశానుసారం మొదటిరోజు సారపాకలోని ఒక హృదయం వృద్ధాశ్రమంలో అన్నదానం కార్యక్రమం నిర్వహించిన బూర్గంపాడు మండల తెరాస పార్టీ నాయకులు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత,మార్కెట్ కమిటీ చైర్మన్ పోడియం ముత్యాలమ్మ , పి ఎ సి ఎస్ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు,టిఆర్ఎస్ మండల అధ్యక్షులు గోపిరెడ్డి రమణ రెడ్డి,టిఆర్ఎస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్,
టిఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు వారాల వేణు,మోడెద్దుల వెంకటేశ్వర రెడ్డి,బండారి లక్ష్మీనారాయణ,సారపాక టౌన్ ప్రెసిడెంట్ కొనకంచి శ్రీను,సారపాక టౌన్ యూత్ ప్రెసిడెంట్ సోము లక్ష్మీచైతన్య రెడ్డి,మార్కెట్ కమిటీ డైరెక్టర్ బాణోత్ శ్రీను,తెలంగాణ ఉద్యమకారులు పోడియం నరేందర్ ,టిఆర్ఎస్ మండల సీనియర్ నాయకులు మేడం లక్ష్మీనారాయణ రెడ్డి ,బెల్లంకొండ రామారావు ,ఐటిసి శ్రామిక శక్తి యూనియన్ నాయకులు సానికొమ్మ శంకర్ రెడ్డి ,స్థానిక టిఆర్ఎస్ నాయకులు తిరుపతి ఏసుబ్ ,బెజ్జంకి కనకాచారి ,గుల్ మహమ్మద్ ,బాలి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: