మన్యం మనుగడ మంగపేట. మంగళవారం జరిగిన పాత్రికేయ సమావేశంలో ముఖ్యమంత్రి కెసిఆర్ మాట్లాడుతూ"భారత రాజ్యాంగం మార్చాలి,కొత్త రాజ్యాంగం తేవాలి 'వారి వ్యాఖ్యల్ని విని విస్తుపోయిన నేతకాని కుల సంఘం తిమ్మంపేట గ్రామ కమిటీ అధ్యక్ష ప్రధాకార్యదర్శి దుర్గం బిక్షపతి, గాందెర్ల సంతోష్ ఆధ్వర్యంలో అంబేడ్కర్ విగ్రహానికి పాలభిషేకం చేసి, పూల దండలు వెయ్యడం జరిగింది. బహుజన వర్గాలకు అనుమానాస్పదంగా, వారిని కించపరిచేలా మాట్లాడితే సమాజానికి తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుంది అని, రాజ్యాంగంలో ఏమి మార్చలనుకుంటున్నవో ప్రజలకు స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇప్పుడు మార్చాల్సింది మహానీయులు ఎంతో శ్రమకోర్చి దేశదేశాలు పర్యటించి, రచించిన పరమ పవిత్రమైన భారత రాజ్యాంగాన్ని కాదని అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసి, ప్రజల కష్టార్జితాన్ని దశాబ్దాలుగా యధేచ్ఛగా దోపిడీ చేస్తు,ప్రజలను తప్పుదారి పట్టిస్తూ బలహీన వర్గాలకు ప్రతినిధులుగా చెలామణి అవుతున్న ఇలాంటి కపట నాయకులను శాశ్వతంగా మార్చవలసిన అవసరం ఎంతైనా ఉన్నదని డిమాండ్ చేశారు.
రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి మేధావులు, విద్యావంతులు, అన్ని వర్గాల ప్రజలు ఎలాంటి త్యాగానికైనా సిధ్ధం కావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
సీఎం కె.సి.ఆర్. తక్షణమే ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోని యావత్తూ ప్రజానీకానికి క్షమాపణలు చెప్పాలని లేని పక్షంలో పలు నిరసన కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా జిల్లా నాయకులు దీగొండ కాంతారావు, దుర్గం నరసింహారావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకలు బసారికారి నాగార్జున్, జాడి రమేష్, యువజన విభాగం అధ్యక్షుడు సల్లూరి రాజేందర్, సహాయ కార్యదర్శి సల్లూరి సత్యనారాయణ, దుర్గం శేశినాథ్, దుర్గం వెంకటేశ్వర్లు, జాడి గణేష్, పూసల గణేష్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: