మన్యం మనుగడ వెబ్ డెస్క్:
2019 వ సంవత్సరంలో ఫిబ్రవరి 14న అతి దారుణంగా ఉగ్రదాడి కి బలైన అమర జవాన్ల ప్రాణ త్యాగాలు వెలకట్టలేనివని, వారి త్యాగాలు భారత దేశం ఎల్లప్పుడూ గుర్తుచేసుకుంటుంది అని తెలిపారు ట్రాఫిక్ ఎస్ఐ శ్రీ ఎస్ తిరుపతి, ఈ మేరకు జెడి ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ సెంటర్ నందు ఉగ్రదాడిలో బలైన అమర జవాన్లకు సంఘీభావంగా కొవ్వొత్తులు వెలిగించి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా జేడీ పౌండేషన్ భాద్యుడు మురళి మోహన్ కుమార్ మాట్లాడుతూ... దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్న జవాన్ల సేవలు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేము అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జేడీ ఫౌండేషన్ సభ్యులు శ్రీ క డాలి నాగరాజు , శ్రీమతి అపర్ణ ,ఏ ఎస్సై సి.హెచ్.వేంకటేశ్వర రావు, విద్యార్థినులు ప్రవళిక, మౌనిక,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: