మన్యం టీవి,మణుగూరు:
మణుగూరు పినపాక పోలీస్ అధికారులకు , సింగరేణి BTPS అధికారులకు తెలియజేయునది ఏమనగా... ఈ నెల ములుగు జిల్లా మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభం కానున్న నేపథ్యంలో అమ్మవార్లను దర్శించుకునేందుకు ఇప్పటికే భక్తులు ప్రయాణాలు సాగిస్తున్నారు. మణుగూరు బయ్యారం జానంపేట ప్రధాన రహదారి గుండా మేడారం వరకు కొన్ని లక్షల మంది భక్తులు ప్రయాణం చేసే అవకాశం ఉంది. అయితే ఇదే ప్రధాన రహదారిలో జానంపేట భూపతి రావు పేట మణుగూరు సాంబయ్య గూడెం లలో ఇసుక ర్యాంపులు నిర్వహించబడుతున్నాయి. ఆ లారీలు రోడ్లపై నిలుపుతూ ప్రమాదాలకు గురి అవుతున్నాయి. భద్రాద్రి ధర్మల్ పవర్ స్టేషన్ కు బొగ్గును తరలించే లారీలు అతివేగంతో మద్యం మత్తులో లారీ డ్రైవర్లు ప్రమాదాలకు కారణమవుతున్నారు. మణుగూరు csp సింగరేణి నుండి, రైల్వే స్టేషన్ మీదుగా ఇసుక లారీలను దారి మరల్చాలని, తద్వారా ఖమ్మం భద్రాచలం అశ్వాపురం మీదుగా మణుగూరు వచ్చే భక్తులకు ట్రాఫిక్ సమస్య తీరుతుంది. లేకపోతే అధిక లోడుతో వెళ్తున్న ఇసుక లారీల వల్ల భక్తులకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అదేవిధంగా భద్రాద్రి ధర్మల్ పవర్ స్టేషన్ కు వచ్చే బొగ్గు లారీలు పైన సరైన విధంగా పట్ట కప్పకపోవడంతో వెనక నుండి వచ్చే వాహనాల పై బొగ్గు పడి ప్రమాదాలకు గురవుతున్నారు. కాబట్టి ఈ విషయమై సింగరేణి అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలి, లేకపోతే మేడారానికి వచ్చే భక్తుల వాహనాలపై బొగ్గు పడే అవకాశం నూటికి నూరు శాతం ఉన్నది. కావున మణుగూరు బయ్యారం పోలీస్ అధికారులకు, సింగరేణి భద్రాద్రి ధర్మల్ స్టేషన్ అధికారులకు భక్తుల రక్షణార్థం పటిష్టమైన రక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా కోరడమైనది. ధన్యవాదాలు.ఈ కార్యాలయం లో నాగార్జున రెడ్డి, పప్పులు వరదర్శ,NGO దేవి లాల్, చారి, బాబురావు కలిసి పోలిస్ స్టేషన్ లో SI గారికి వినతి పత్రం అందజేశారు.
Post A Comment: