గుండాల/ ఆళ్ల పల్లి ఫిబ్రవరి 15 (మన్యం మనుగడ) క్రీడాకారులు తప్పకుండా స్నేహభావం పెంపొందించుకోవాలని ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు వారికి సూచించారు. మంగళవారం ఆళ్ల పల్లి మండలం పరిధిలోని ముత్త పురం గ్రామంలో యూత్ ఆధ్వర్యంలో నిర్వహించే క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ క్రీడల్లో రాణించి సైతం ఉద్యోగాలు సాధించవచ్చని ఆయన అన్నారు. గతంలో నేను కూడా ప్రభుత్వ పాఠశాలలో పి టి గా పని చేశానని క్రీడలు తరచుగా ఆడటం వలన శారీరక దృఢత్వం తో పాటు మానసిక ఉల్లాసం ఉంటుందన్నారు. ప్రస్తుత తరుణంలో బిజీ తరుణంలో జీవిస్తున్న అప్పటికి క్రీడల్లో కూడా అవసరమే అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ఈశ్వరి, ఎంపీపీ మంజు భార్గవి, టిఆర్ఎస్ నియోజకవర్గ నాయకులు భవాని శంకర్, మండల అధ్యక్షులు నరసింహారావు, కోపరేటివ్ చైర్మెన్ రామయ్య, గుండాల సీఐ కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: