- ఫారెస్ట్ అధికారులు తమ పద్దతి మార్చుకోకుంటే తగిన గుణపాఠం తప్పదు ఎంపీపీ రేగా కాళికా, మండల అధ్యక్షులు రావుల సోమయ్య గౌడ్
మన్యం మనుగడ కరకగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలపరిదిలోని వెంకటపూరం,దేవారనాగరం,పాపాయిగూడెం,గ్రామాలలోని పోడు భూములలో ఫారెస్ట్ అధికారుల అతి ఉత్సాహంతో జేసిపి తో కందకాలు తియ్యడం ప్రారంబించారు. విషయం తెలుసుకున్న పోడు సాగుదారులు,మండల టిఆర్ఎస్ పార్టీ నాయకులు,కరకగూడెం ఎంపీపీ రేగా కాళికా అక్కడికి చెరుకోని ఫారెస్ట్ అధికారులతో వాగ్వివాదానికి దిగి ఫారెస్ట్ అధికారులను,జేసిబిని అక్కడినుండి పంపించారు. ఈ సందర్భంగా ఎంపీపీ రేగా కాళికా మాట్లాడుతూ ఒక పక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ రెండు నెలలో అర్హులైన ప్రతి పోడు సాగుదారులకు పట్టాలు ఇచ్చె దిశగా ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే ఫారెస్ట్ అధికారులు మాత్రం అతి ఉత్సాహం ఉపయోగించి కందకాలు తవ్వే ప్రయత్నం మసనుకోవాలని అన్నారు.ఈ విషయం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక శాసనసభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రేగా కాంతారావు ఒక పక్క ఫారెస్ట్ అధికారులకు ఆదేశాలు ఇచ్చిన వారి ప్రవర్తన తీరు మారక పోవటంతో ఫారెస్ట్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బూర్గంపాడు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు కొమరం రాంబాబు, పార్టీ నాయకులు రేగా సత్యనారాయణ, సర్పంచ్ ల సంఘం మండల అధ్యక్షులు పాయం నరసింహారావు, మహిళ మండలి అధ్యక్షురాలు కాసు లావణ్య, యువజన విభాగం అధ్యక్షులు గుడ్ల రంజీత్ కుమార్, సోషల్ మీడియా అధ్యక్షులు చిట్టిమళ్ళ ప్రవీణ్, యువజన విభాగం ప్రధాన కార్యదర్శి కటుకోజులా దీలిప్,ఎలిపెద్ది రవి,రైతులు గొగ్గలి. సాగర్,సోలం చంటి,హన్మంతరావు, రాజశేఖర్,రవి,సురేష్, పాయం.క్రిష్ణ,రైతులు పాల్గొన్నారు.
Post A Comment: