మన్యం వెబ్ డెస్క్ :
హైదరాబాద్ : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి, విగ్రహాలకు దండలు వేయడం కాదు.. దళిత జాతికి ఏం చేశారో చెప్పాలని భారతీయ జనతా పార్టీకి టీఆర్ఎస్ పార్టీ నాయకులు మోత్కుపల్లి నర్సింహులు సవాల్ విసిరారు. సీఎం కేసీఆర్ వ్యాఖ్యలను వక్రీకరించడం సరికాదన్నారు. ప్రతిపక్షాలు బట్టలు చింపుకుంటున్నాయి. బీజేపీ వాళ్లు అయితే ఏదో జరిగినట్టుగా అరుస్తున్నారు అని మోత్కుపల్లి నర్సింహులు మండిపడ్డారు. బేగంపేటలోని తన నివాసంలో మోత్కుపల్లి నర్సింహులు మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం విభజన హామీలను నెరవేర్చలేదు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కోచ్ ఫ్యాక్టరీ ఎక్కడికి పోయాయి? అని నిలదీశారు. రాష్ట్రాల హక్కుల కోసం సీఎం కేసీఆర్ పోరాడుతున్నారు. రైతు చట్టాలపై మోదీ క్షమాపణ చెప్పినప్పుడే ప్రధానిగా ఉండే అర్హత కోల్పోయారు అని పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో ఎదుగుతున్న సీఎం కేసీఆర్‌ను బీజేపీ తొక్కే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు.
దేశ వ్యాప్తంగా దళిత బంధు ఇచ్చే దమ్ము బీజేపీకి ఉందా?
దళిత బంధు ఇస్తున్న సీఎం కేసీఆర్‌పై విమర్శలు చేస్తుంటే మీరు ఎంత దుర్మార్గపు మనుషులో అర్థం అవుతుందని మోత్కుపల్లి మండిపడ్డారు. దళితుల మీద మీకు ప్రేమ ఉంటే దేశవ్యాప్తంగా ఎందుకు దళిత బంధు ఇవ్వడం లేదు.. ఇచ్చే దమ్ము మీకు ఉందా? అని ప్రశ్నించారు. దళితలకు న్యాయం చేసే దమ్ము దైర్యం మీకు ఉందా? కేసీఆర్‌ను తిట్టడమే పనిగా పెట్టుకుంటే ఖబడ్దార్ మిస్టర్ బండి అని హెచ్చరించారు. కేసీఆర్ ఆదర్శవంతంగా పాలన చేస్తుంటే ఓర్వలేక పోతున్నారు అని నర్సింహులు మండిపడ్డారు.
Post A Comment: