ములకలపల్లి:ఫిబ్రవరి15:(మన్యం మనుగడ)న్యూస్:
తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్,జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు,అశ్వరావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు మెచ్చ నాగేశ్వరరావు ఆదేశాలు మేరకు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ జన్మదినం సందర్బంగా మండల కేంద్రం లోని మంగపేట పి.హెచ్.సి ప్రభుత్వ ఆస్పిటల్ నందు రోగులకు పండ్లు,ఆహార పొట్లాలు టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మోరంపూడి అప్పారావు ఆధ్వర్యంలో పంపిణీ చేశారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముద్దుబిడ్డ సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారని,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దవాఖానాల్లో అన్ని సౌకర్యంగా తీర్చిదిద్దిన నాయకుడు సీఎం కేసీఆర్ అంటు కొనియాడారు. కావున ఆయన ఎల్లప్పుడు సంపూర్ణ ఆరోగ్యంతో సంతోషంగా ఉండాలని ఆ భగవంతుని ప్రాదిస్తున్నానని అన్నారు.ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ ఎంపీపీ మాట్లా నాగమణి,పర్వతనేని అమరనాథ్,తన్నీరు నాగయ్య,
కార్యదర్శి శనగపాటి అంజి, పుష్పాల చందర్రావు, కారం సుధీర్ సర్పంచ్, శనగ పటి రవి, కొండవీటి రాజారావు, తమ్మిశెట్టి వెంకటేశ్వర్లు,
గడ్డం బాబురావు, మోటార్ రవి, రాజు,దుగ్గి సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: