మన్యం టీవి, మణుగూరు:
మాదిగ జేఏసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు సిద్దెల తిరుమలరావు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యా సంస్థల పట్ల తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ తెలంగాణ ప్రభుత్వం విప్ పినపాక శాసనసభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ఆదేశాల మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం సమితి సింగారం పంచాయతీ బాపూజీ నగర్ ప్రాథమిక పాఠశాల స్కూల్ నందు బెలూన్స్ ఎగరవేసి పిల్లలు ను స్కూల్ కి ఆహ్వానిస్తూ స్వాగతం పలుకుతున్న మాదిగ జేఏసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు సిద్దెల తిరుమలరావు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో వచ్చే విద్యా సంవత్సరం నుండి ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టాలని ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఫీజులు నియంత్రణకు చట్టం తీసుకురావాలని క్యాబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకోవటం సంతోషకరమైన విషయం అని హర్షం వ్యక్తం చేస్తూ గులాబీ బెలూన్స్ ఎగరవేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వార్డు నెంబర్ కమ్మపాటి శ్రీను స్కూల్ సార్ బ్రహ్మయ్య, టీచర్ షకీలా, దుర్గ రమేష్, సాంబశివరావు, వెంకన్న ,పీస్ పి సాయిచరణ్ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: