- సీఎం కేసీఆర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన ప్రజా ప్రతినిధులు,పార్టీ నాయకులు
మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక శాసనసభ్యులు,టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ఆదేశాల మేరకు ప్రభుత్వ పాఠశాలలో వచ్చే విద్యా సంవత్సరం నుండి ఇంగ్లీష్ మీడియం బోధన చేయాలని తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా, ఆనందోత్సవాల మధ్య విద్యార్థులతో కలిసి బెలూన్స్ ను ఎగరవేసి విద్యార్థులకు స్వాగతం పలికిన జడ్పీటీసీ పొశం.నర్సింహారావు,ఎంపీపీ కారం.విజయకుమారి,ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,ఇటీవల ముఖ్యమంత్రి కెసిఆర్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో, బడుగు బలహీన వర్గాల విద్యార్థులు చదువుకుంటున్న ప్రభుత్వ పాఠశాలలో,వచ్చే విద్యా సంవత్సరం నుండి ఇంగ్లీష్ మీడియం బోధన చేయాలని గొప్ప నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటికే దాదాపు 1,000 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి నాణ్యమైన ఉచిత ఇంగ్లీష్ మీడియం విద్యను అందించడం జరుగుతుందన్నారు.అంతటితో ఆగకుండా రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం బోధన చేయాలని నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషకరం అన్నారు. ప్రస్తుతం మారుతున్న పరిస్థితుల ప్రకారం ఇంగ్లీష్ మీడియం ద్వారానే ఈ పేద బడుగు బలహీన వర్గాలు విద్యార్థులుకు మంచి జరగాలి అనే ఉద్దేశంతో ఎంత గొప్ప నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి కెసిఆర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసి,పాఠశాలలో నాణ్యమైన విద్యాబోధన పాఠశాలల్లో మెరుగైన మౌలిక వసతుల కల్పన కోసం రూ 7289 కోట్లతో *మన ఊరు మన బడి* ప్రణాళికతో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని నిర్ణయించడం జరిగింది అన్నారు.ఈ కార్యక్రమంలో మణుగూరు మండల ఎంపిపి కారం విజయ కుమారి,స్థానిక ఎంపీటీసీ గాజుల రమ్య, టిఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి రాడిమి రామిరెడ్డి, పినపాక నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు మట్టపల్లి సాగర్ యాదవ్,టిఆర్ఎస్ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు పాకల రమాదేవి,యూత్ నాయకులు గాజుల నరేష్,పాఠశాల,ప్రధానోపాధ్యాయులు పటేల్, పాఠశాల సిబ్బంది,విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: