మన్యం మనుగడ ప్రతినిధి అశ్వాపురం: ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం లోని రైతు వేదిక అశ్వాపురం క్లస్టర్ నందు ఎమ్మార్వో సురేష్ కుమార్ అధ్యక్షతన జరిగిన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్,70 మంది లబ్ధిదారులకు 70 లక్షల 8120 రూపాయలు విలువగల చెక్కులను ప్రజా ప్రతినిధులతో కలిసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది.ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు, టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు మాట్లాడుతూ ఆడబిడ్డలకు సర్కార్ కానుక కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్,అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి కెసిఆర్ పనిచేస్తున్నారని సంక్షోభంలోనూ సంక్షేమానికి పెద్దపీట వేస్తూ రాష్ట్రాన్ని దేశంలోనే అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్తున్నారని అన్నారు.2014 ముందు ఆడపిల్లలకు పెళ్లి చేయాలంటే పేదవారు అప్పు చేసి పెళ్లి చేసేవారని టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కెసిఆర్ గారు ఆడబిడ్డలకు మేనమామ గా మారి ఒక లక్ష 116 రూపాయలను ఆడబిడ్డలకు సర్కార్ కానుకగా చెక్కుల రూపంలో నేరుగా అందజేయడం జరుగుతుందని అన్నారు. కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్, పథకాన్ని అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ అన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలు నిరుపేదలకు ఎంతో ఆసరాగా నిలుస్తున్నాయని కరోనా సంక్షోభంలో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమానికి పెద్దపీట వేశారని తెలిపారు.ప్రజలకు కావలసిన సదుపాయాలు పై ప్రత్యేక దృష్టి సారించి సమస్యలకు ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోడి అమరేందర్, వైస్ ఎంపిపి వీరభద్రం, స్థానిక సర్పంచ్ శారద, నియోజకవర్గ ఎస్సీసెల్ అధ్యక్షులువెన్న అశోక్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు వెంకటరమణ, ఎంపీటీసీలు, సర్పంచులు, వార్డు మెంబర్లు, ఎంపీడీవో, ఎం పీ ఓ అశ్వాపురంటిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పార్టీ ముఖ్య నాయకులు, సోషల్ మీడియా సభ్యులు, పలు శాఖల ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: