CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

గులాబీ బెలూన్స్ ను ఎగరవేసి విద్యార్థులకు స్వాగతం పలకిన టిఆర్ఎస్ నాయకులు:పట్టణ అధ్యక్షులు అడపా. అప్పారావు.

Share it:

 



మన్యం టీవీ మణుగూరు:


తెలంగాణ లోని ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం నుండి ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలని, ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణకు చట్టం తీసుకురావాలని,క్యాబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి *కేసీఆర్* కీలక నిర్ణయం తీసుకోవటం సంతోషకరమైన విషయమని,హర్షం వ్యక్తం చేస్తూ,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు పట్టణంలోని అన్ని పాఠశాలల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక శాసనసభ్యులు మరియు టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ఆదేశాల మేరకు టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అడపా.అప్పారావు ఆధ్వర్యంలో పార్టీ ముఖ్య నాయకులతో కలిసి గులాబీ బెలూన్స్ ను ఎగరవేసి విద్యార్థులకు స్వాగతం పలకడం జరిగింది.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అడపా.అప్పారావు మాట్లాడుతూ,కేసీఆర్,ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు విద్యారంగంలో సమూలమైన మార్పులు చేశారని,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థను బలోపేతం చేసారని అన్నారు.తెలంగాణ ప్రభుత్వం విద్యా వ్యవస్థను పటిష్ట పరిచేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టడం అదేవిధంగా ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఫీజులపై చట్టం తీసుకురావటం వల్ల ప్రభుత్వ విద్య మరింత బలోపేతం అవుతుందని, ఆయన తెలిపారు.ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో మరియు బీ.సి ఎస్సీ,ఎస్టీ, మైనార్టీ, గురుకులాల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగిందని,ప్రైవేట్ విద్యా సంస్థల నుండి విద్యార్థులు ప్రభుత్వ విద్యాసంస్థల్లో చేరుతున్నారని,ప్రభుత్వం తాజాగా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు పెద్ద ఎత్తున లాభం చేకూరుతుందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టడం వల్ల ప్రైవేట్ విద్యా సంస్థలకు దీటుగా ప్రభుత్వ విద్య అందుబాటులోకి రానుందని, తెలిపారు.ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల విద్యార్థి లోకం అంతా హర్షం వ్యక్తం చేస్తుందని ఆయన అన్నారు.సర్కారు బడుల్లో ఇంగ్లీష్ మీడియం వచ్చే ఏడాది ప్రవేశపెట్టనున్న సందర్భంగా,స్కూలు ప్రారంభం అయిన నేపథ్యంలో,టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పట్టణ పరిధిలోని అన్ని స్కూల్ లో గులాబీ కలర్ బెలూన్లతో విద్యార్థులకు స్వాగతం పలకడం జరిగింది అన్నారు.ఈ కార్యక్రమంలో అడపా. అప్పారావు,కార్యదర్శి బొలిశెట్టి.నవీన్,యువజన అధ్యక్షులు రుద్ర వెంకట్, నాయకులు కృష్ణ,బాబీజాన్, లక్ష్మయ్య,తాత రమణ, టిఆర్ఎస్ పార్టీ పట్టణ నాయకులు,కార్యకర్తలు,యువజన నాయకులు,సోషల్ మీడియా సభ్యులు,స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: