మన్యంటీవి, అశ్వారావుపేట:బ్యాంకు ఖాతాదారులు ప్రతి ఒక్కరూ నగదురహిత లావాదేవీలపై అవగాహన కలిగి ఉండాలని సిఎఫ్ఎల్ దమ్మపేట కోఆర్డినేటర్ వి అంజిబాబు అన్నారు. అశ్వరావుపేట మండల పరిధిలోని జమ్మి గూడెం గ్రామ పంచాయతీలో శనివారం ఇన్చార్జి సర్పంచ్ పెన్నాడ సూర్య కళ ఆధ్వర్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అనుసంధానం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి సహకారంతో ఫేస్ స్వచ్ఛంద సంస్థ సభ్యులు కోఆర్డినేటర్ వి అంజి బాబు, ఫీల్ ఇన్వెస్టిగేటర్ దాది చంటి లు ఖాతాదారులకు ఆర్థిక అక్షరాస్యత మరియు బ్యాంకు లావాదేవీలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బ్యాంకు ఖాతాదారులు బ్యాంకు లావాదేవీలు నిర్వహించే విషయంలో జాగ్రత్త వహించాలని, నగదు రహిత లావాదేవీలు నిర్వహించడం ద్వారా లావాదేవీలు పారదర్శకంగా ఉండునని, మోసపోకుండా ఉండవచ్చునన్నారు. బ్యాంక్ అందించే వివిధ సేవలుపై అవగాహన కల్పించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలైన ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన, సుకన్యా యోజన, రూపే కార్డు ఉపయోగాలు, ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి భీమా యోజన, ఎస్బీఐ లైఫ్ తదితర కార్యక్రమాలపై ఖాతాదారులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ముద్దిన కొండయ్య, గ్రామ పెద్దలు పెన్నాడ ఏసు, ముద్దిన రాజు, డ్వాక్రా మహిళలు, యువతి, యువకులు బేతి రవీంద్ర, కాటన్ తిరుపతిరావు, దానపు హరి తదితరులు పాల్గొన్నారు .
Post A Comment: