CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

సింగరేణిని ప్రైవేటుపరం చేస్తే ఊరుకోం.కుట్రపూరిత రాజకీయాలు మానేయండి.సింగరేణి నిరసన దీక్షలో పాల్గొన్న ప్రభుత్వ విప్

Share it:

 



మన్యం మనుగడ, మణుగూరు:


ప్రధాని మోది వ్యాఖ్యలను నిరసిస్తూ, టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ , మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామారావు ఇచ్చిన పిలుపు మేరకు నల్లబ్యాడ్జీలు ధరించి ఒకరోజు నిరసన దీక్ష కార్యక్రమంలో పాల్గొన్న, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ , పినపాక శాసనసభ్యులు , టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు పాల్గొన్నారు.

 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం లోని అంబేద్కర్ సెంటర్ లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం చేస్తున్న వ్యతిరేక విధానాలకు అనుసరిస్తూ పినపాక నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం వారితో కలిసి ఒక రోజు నిరసన దీక్షలో రేగా కాంతారావు పాల్గొనడం జరిగింది.


 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 

 సింగరేణి ప్రైవేటీకరణకు కేంద్రంలోని బీజేపీ కుట్ర చేస్తుందని, సింగరేణి ని బలహీనపరిచి, నష్ట పూరిత పబ్లిక్ సెక్టార్ కంపెనీ గా మార్చి అంతిమంగా ప్రైవేటుపరం చేసే కుట్రను కేంద్రంలోని బిజెపి అమలు చేస్తోందన్నారు. సింగరేణి లోని నల్ల బంగారం యావత్ తెలంగాణ కే కొంగు బంగారం అని, సింగరేణిని దెబ్బతీస్తే, కేంద్రంలోని బిజెపి కోలుకోని విధంగా దెబ్బతినడం ఖాయం అని వారు హెచ్చరించారు.కేంద్రం సింగరేణి పై ప్రైవేటు వేటు వేస్తే బిజెపిపై రాజకీయంగా వేటు వేసేందుకు తెలంగాణ సమాజం సిద్ధంగా ఉందని స్పష్టం చేసారు.సిరులు కురిపించే సింగరేణి జోలికి వస్తే కార్మికుల సెగ ఢిల్లీకి తాకడం ఖాయమని హెచ్చరించారు. సింగరేణి కాపాడుకునేందుకు మేము అన్ని విధాలుగా సింగరేణి బిడ్డలకు, కార్మికులకు అండగా ఉంటాంమని, వారితో కలిసి ఉద్యమ కార్యచరణ చేపడతామన్నారు.

 సింగరేణి లో ఉన్న జేబీఅర్ ఓసి,3, కేకే 6, శ్రవనపల్లి ఓసి, కొయగూడెం గనులను సింగరేణి సంస్థకు కేటాయించకుండా వాటికోసం వేలంలో పాల్గొనాలని నిర్దేశించడం పైన వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి గత 7 ఏళ్ల కాలంలో 450 లక్షల టన్నుల ఉత్పత్తి నుంచి 670 లక్షలు టన్నుల ఉత్పత్తి జరిగిందని, దీంతో బొగ్గు తవ్వకాలు, రవాణా, లాభాలు కంపెనీ, విస్తీర్ణం విషయంలోనూ సింగరేణి గణనీయమైన ప్రగతిని సాధిస్తూ వస్తున్న దన్నారు.నల్లబ్యాడ్జీలు ధరించి ప్రధానమంత్రి మోడీ గారి శవయాత్ర నిర్వహించి దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది.

టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ఒకరోజు దీక్ష కార్యక్రమానికి వివిధ సంఘాల ప్రతినిధులు, పలువురు కార్మికులు దీక్ష ప్రాంగణానికి విచ్చేసి సంఘీభావం తెలిపారు.

ఈ కార్యక్రమంలో పినపాక నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పార్టీ ముఖ్య నాయకులు, తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు...

Share it:

TS

Post A Comment: