CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

రాజ్యాంగాన్ని మార్చడం అనేది.రాజ్యాంగ శిల్పికి పాలక వర్గాల చే దక్కుతున్న సన్మానం---:గుగ్గిళ్ల సురేష్ ఎమ్మార్పిఎస్ నాయకులు.

Share it:

 


మన్యం మనుగడ మంగపేట.

భారత దేశానికి,భారత దేశ భవిష్యత్ తరాలకు దిశా నిర్దేశం చేసిన మహానుభావులు డా :బి ఆర్ అంబేద్కర్. అంబేద్కర్ ఆరోజు రాసిన రాజ్యాంగం అప్పుడు ఇప్పుడు ఎప్పుడు అయినా కూడ ఆమోద యోగ్యత కలిగిన ప్రామాణికమైన అద్భుతమైన గ్రంధం. భారత రాజ్యాంగం, భారత రాజ్యాంగ నిర్మాత మనకు ఎప్పుడు పూజ్యనీయలే. బ్రిటిష్ వారి కాలం నుండి భారత రాజ్యాంగం అమలు లోకి వచ్చేంత వరకు భారత దేశం లో కూడ ఎన్నికలు జరిగినవి కానీ, దేశ ప్రజలందరికి ఓటు హక్కు లేదు. 10 శాతం కులీనులు,భూస్వాములు, పెద్ద మనుషులు, సంఘం లో పరపతి కల్గిన వారు పన్నులు చెల్లించే వారు, సంపన్నులు,బాగా చదువుకున్న వారికి మాత్రమే ఓటు హక్కు ఉండేది. అంబేద్కర్ రాసిన రాజ్యాంగంతో ఇప్పుడు సర్వజనీనమైన ఓటు హక్కుతో మన నాయకులను మనం ఎన్నుకుంటున్నాం. సమాజంలో ప్రజలందరికి సమానమైన అన్ని రకాల హక్కులు కల్పించి ప్రజలను అభివృద్ధి చెందుటకు అవకాశం కల్పించారు. దేశం లోని ప్రజలకు ప్రభుత్వం ఉచితంగా విద్య,వైద్యం అందిస్తే భవిష్యత్ లో ప్రజలకు ఎటువంటి ఉచిత పథకాల అవసరం ఉండదు అని సూచనలు చేశారు అంబేద్కర్ అటువంటి మహనీయుడు భారత రాజ్యాంగనిర్మాత డా :అంబేద్కర్ కు మనం మన పాలకులు చేసే సన్మానం ఏమిటీ 1951సెప్టెంబర్ 27 తన మంత్రి పదవికి సైతం రాజీనామా చేసేలా చేయడం, అందరూ కలసి చట్టసభల్లోకి రాకుండా 1952 ఎన్నికల్లో ఓడించి మరల 1954 లో జరిగిన ఉపఎన్నికల్లోసైతం ఓడించి రాజ్యాంగనిర్మాత కు అప్పుడు సన్మానం చేశారు మరల ఇప్పుడు తాను రాసిన రాజ్యాంగాన్నే మార్చి అంబేద్కర్ ఉనికి అసలే లేకుండాచేయటానికి మరల కొంతమంది కంకణం కట్టుకొన్నారు. భారత దేశం, భారత రాజ్యాంగం, భారత దేశ ప్రజలకు సైతం పెను ప్రమాదం ముంచి ఉంది. ఈ ముప్పు పై భారత దేశ ప్రజలు యావత్తు ఎదుర్కోవాలని పొంచి ఉన్న ముప్పు పై ప్రజలు ముప్పేట దాడి చేయాలనీ దళిత, గిరిజన, బహుజన, మైనారిటీ ప్రజలను యం యస్పి,ఎమ్మార్పిఎస్ నాయకులు గుగ్గిళ్ల సురేష్ ఈ సందర్బంగా కోరారు.

Share it:

TS

Post A Comment: