హైదరాబాద్ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతోందని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. ఆదివారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్రం తీసుకువచ్చిన విద్యుత్ సంస్కరణలపై కేంద్రాన్ని తూర్పారబట్టారు. రాష్ట్రం విద్యుత్ సంస్కరణలు అమలు చేయకుంటే.. నిధులు ఇవ్వకుండా పీఎఫ్‌సీ.. ఆర్‌ఈసీపై కేంద్రమంత్రి ఆర్కే సింగ్ ఒత్తిడి తెస్తున్నారని మండిపడ్డారు. ఇంకా ఆయన మాటల్లోనే.. ‘మనకు ఉన్నటి వంటి నీటి ప్రాజెక్టుల్లో పీఎఫ్‌సీ ఆర్‌ఈసీ. రాష్ట్రానికి లోన్లు ఇస్తయ్. రాష్ట్రానికి మంచి డిసిప్లేయిన్ ఉంది కాబట్టి, లోన్లు రీపేమెంట్ మంచి ఉంటది కాబట్టి డబ్బులు ఇస్తరు. ఆ ఇచ్చే డబ్బులు ఆపేయమని కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ పవర్ రీఫామ్స్ తెస్తలేరని ఒత్తిడి తెస్తున్నరు.. ఇదీ జరుగుతున్నది.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బహిరంగ క్షమాపణ వేడుకోవాలి
ఈ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు తెలుస్తదా? ఎందుకు మాట్లాడుతడు ఆయన. ఇప్పుడు బహిరంగ క్షమాపణ వేడుకోవాలి. మీడియాకు అన్ని డాక్యుమెంట్లు ఇచ్చాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ను అడుగొచ్చు కదా. ఫైనాన్స్ మినిస్టర్ ఇచ్చిన ఆధారాలు ఇచ్చాం దాని అర్థమేంటి. ఒకరకంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రాజ్యాంగ ఉల్లంఘన. రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం. పార్లమెంట్‌ను అవమానించడం.. దేశ ప్రజలను మోసం చేయడం. ఇంకా డ్రాఫ్ట్ బిల్లుగానే ఉంది. ఇది జరిగే చరిత్ర.
దీని మీద చెబితే బాధ.. అంటే బాధ. నేను ప్రధానమంత్రి అని.. పైసలు ఇస్తడి ఆశపడి మిషన్ భగీరథ ఇనాగ్రేషన్‌కు పిలిచిన. ఆయన కూడా సభలో పచ్చి అబద్దాలు చెప్పారు. ఆయన ఏం చెబుతాడన్న అంతకు ముందే మేం రూ.11 పవర్ కొన్నరు.. మేం 1.10 రూపాయలకే ఇస్తున్నం అంటున్నడు. భారతదేశ చరిత్రలో సెంట్రల్ గవర్నమెంట్ ఎన్నడూ ఏ రాష్ట్రానికి ఇవ్వలేదు. కానీ మేం ఇస్తున్నమని అంటే పెద్దమనిషి అని బాగుండదని ఊరుకున్నం. ఆ తర్వాత వెంటనే ఎలక్ట్రిసిటి అధికారులు అడిగితే అతిథిగా పిలిచినం తిడితే బాగుండదని ఊకున్నం. ఇట్ల ఎన్ని విషయాల్లో చెబుతరు.
విద్యుత్‌ను వాడే తెలివితేటలు కేంద్రానికి లేవు..
నేను చాలెంజ్ చేసిన ఎవరూ మాట్లాడుతరు బీజేపీ వాళ్లు అని అన్న.. దేశంలో 4లక్షల మెగావాట్ల పవర్ ఉంది దేశంలో.. దాన్ని వాడే తెలివితేటలు లేవు ఈ కేంద్ర ప్రభుత్వానికి.. బ్యాడ్ పవర్ పాలసీ ఉందని చెప్పిన. 40వేల మెగావాట్ల పవర్ ఉత్పత్తి సంస్థలు దేశంలో నిర్మించబడ్డయ్. పీపీఏలు అయిపోయినయ్.. ఫ్యూయల్ టైయప్ అయ్యింది. కానీ ప్రొడక్షన్ కానిస్తలేరు. ఎందువల్ల.. ఈ దేశం వల్ల. ఈ దేశం అవలంభించే దిక్కుమాలిన పవర్ పాలసీ వల్ల. చేతకాని దద్దమ్మ కేంద్ర ప్రభుత్వం వల్ల. 60శాతం దేశం పవర్ కట్స్‌లో ఉంటది. 24గంటల కరెంటు ఏరాష్ట్రంలో ఇవ్వరు ఒక తెలంగాణలో తప్పా ఇది వాస్తవం.
ఇది నిజమా? అబద్దమా?.. నేను పిచ్చి మాటలు మాట్లాడను ఆ అవసరం లేదు.. ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతా. ఇంత దుర్మార్గంగా ఆ పార్టీ వాళ్లు ప్రతి విషయంలో అబద్ధాలు, మోసాలు. దేశాన్ని సర్వనాశనం చేస్తున్నరు. ఇవన్నింటిని మించి అఖిలభారత విద్యుత్ ఉద్యోగ సంఘాలు ఒక్కటై సమావేశాలు పెట్టాయ్. మన వద్ద మింట్ కాపాండ్‌లో మన ఉద్యోగులు ఆందోళనలు చేశారు. విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించి, వాళ్ల పార్టీకి చెందాలు ఇచ్చే వాళ్లకు డబ్బులు ఇచ్చేటోళ్లు. వాళ్లను సాదెటోళ్లు, ఎన్నికలకు డబ్బులిచ్చిటోళ్లకు, వేలకోట్ల దిగమింగి.. వాళ్లు పెట్టే సోలార్ విద్యుత్ కొనాలని చట్టం. దానికి అందమైన పేరు చట్టం, విద్యుత్ సంస్కరణలు..
బీజేపీ మిత్రుల సోలార్ పవర్ కోనాలట..
మనకు మన తెలంగాణకు జల విద్యుత్ అందుబాటులో ఉన్నది కృష్ణా నదిపై ఎక్కువ. నాగార్జునసాగర్, శ్రీశైలం, పులిచింతల, జూరాల. 2500వేల మెగావాట్ల దాగా ఉంటుంది. గోదావరిపై తక్కువ ఉంది మనకు కృష్ణానదిపై ఎక్కువ ఉంది. ఈ దిక్కుమాలిన చట్టంలో వాళ్ల బీజేపీ మిత్రులు పెట్టే 30వేల, 40వేల మెగావాట్ల సోలార్ కొనాలట గ్రీన్ ఎనర్జీ కింద. గ్రీన్ ఎనర్జీ అయినా నాగార్జున సాగర్, శ్రీశైలంలో జల విద్యుత్ ఉత్పత్తి బంద్ పెట్టి సరే దీన్ని కొనాలి.. లేదంటే ఫైన్ వేస్తం, ఇది చట్టం. మీ పెట్టుబడిదారుల స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజల ప్రయోజనాలు తాకట్టుపెడుతరా? అన్ని తప్పుడు ప్రచారాలు, అబద్దాలపై ఎన్ని రోజులు నడుపుతరు భారతదేశాన్ని, ఇది ఎంత వరకు సమంజసం.
దీనిపై చర్చపెట్టండి. ఇన్ని అబద్దాలు చెప్పే వ్యక్తులను చీల్చి చెండాల్సిన బాధ్యత మీడియాపై ఉన్నది. ఈ దేశం ఇలాగే నాశనం కావాలా? చాలా ఉంది ఇంకా భాగోతం. నేను దుఃఖంతో చెబుతున్నా. అన్ని రంగాల్లో సర్వనాశనం ప్రతిరంగంలో.. పిచ్చి అబద్ధాలు. పచ్చి అబద్దాలు.. ఇక్కడ కాదా విదేశాల్లోనూ చెప్పుడే సిగ్గుపోతుంది. 2025 వరకు 5 ట్రిలియన్ల ఎకానమీ చేస్తాం. ఇంతకన్నా దిక్కుమాలిన దందా ఉంటదా? అది చంద్రయాన్ మీద పోయినదానితో సమానం అంటరు. మనం కూడా చంద్రమండలంపై దిగినట్టే అనుకోవాలే ఇగ.. ఇంత పచ్చి అబద్దమా.. ఇది ప్రగతా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Post A Comment: