టేకులపల్లి ఫిబ్రవరి 12 (మన్యం మనుగడ)టేకులపల్లి మండలంలోని కోయగూడెం ఓసీ ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు వైద్య సేవాలను అందించాలని జిల్లా కాంగ్రెస్ లీడర్,డీసీసీబీ డైరెక్టర్, బేతంపూడి సోసైటి డైరెక్టర్ లక్కినేని సురేందర్రావు అన్నారు. టేకులపల్లి మండల కేంద్రంలో విలేకరులతో శనివారం ఆయన మాట్లాడుతూ...టేకులపల్లి మండలంలోని కోయగూడెం ఓసీ ప్రభావిత ప్రాంతాల్లోని గిరిజన,ఆదివాసి ప్రజలకు మొబైల్వాహనం ద్వారా వైద్యా సేవలు వెంటనే అందించాలని సింగరేణి యాజమాన్యని కోరారు. ఓసీ చూట్టు పక్కల ప్రాంతాల్లోని మారుముల గ్రామాలకు వెళ్ళి వైద్యా సేవలు అందించాలని కేవోసీ పీవో మల్లారాపు మల్లయ్యతో ఫోన్లో తెలిపారు. కోయగూడెం ఓసీ ప్రాంతాలను అభివృద్ధి చేయాలని ఆయన కోరారు.
Post A Comment: