CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఫారెస్ట్ అధికారులు పోడు భూముల ఆక్రమణలు ఆపాలి.

Share it:

 



మన్యం టీవి న్యూస్,మణుగూరు(భూర్గంపాడ్) ఆదివాసులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు 2014 జూన్ 2 వ తేదీని కటాఫ్ గా నిర్ణయించి పట్టాలు ఇవ్వాలని సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీ మణుగూరు సబ్ డివిజన్ కమిటీ కార్యదర్శి మోర రవి, బూర్గంపాడు మాజీ జెడ్పిటిసి బట్టా విజయ్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ బూర్గంపాడు మండల అధ్యక్షులు దుగ్గెoపూడి కృష్ణారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం బూర్గంపాడు మండల పరిధిలోని కృష్ణసాగర్ గ్రామపంచాయతీ దోసపాడు ఆదివాసి గ్రామానికి చెందిన భూముల్లో కందకం తీయడానికి ఫారెస్ట్ అధికారులు డి ఆర్ వో జె భారతి ఆధ్వర్యంలో భారీ యంత్రాలతో పాతూరి వద్ద న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో ఆదివాసీల తో కలిసి అడ్డుకోవడం జరిగింది ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు పాల్గొని మాట్లాడుతూ చత్తీస్గడ్ రాష్ట్రంతోపాటు తెలంగాణ సరిహద్దున ఉన్న అనేక గ్రామాల నుండి అక్కడ ఉన్నటువంటి భయానక పరిస్థితుల్లో ఆదివాసి కుటుంబాలు గత 30 సంవత్సరాల నుండి 2014 జూన్ 2 వ తేదీ గా నిర్ణయించి ఆదివాసీలకు వారు సాగుచేసుకుంటున్న పోడు భూములకు పట్టా హక్కు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆధార్ కార్డు రేషన్ కార్డు ఓటుహక్కుగుర్తింపుకార్డు గ్రామీణఉపాధిహామీ జాబ్ కార్డులు తదితర గుర్తింపు కార్డులు కలిగి ఉన్నవారినందరిని స్థానికులు గా గుర్తించాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత , తెలంగాణ ప్రభుత్వం వలస ఆదివాసీలను గుర్తించమని వారికి పోడు భూములపై హక్కులు కల్పించమని అసలు వలస వచ్చిన వారు ఇక్కడ ఆదివాసీలు గా గుర్తించటం లేదని చెప్పటం విస్మయానికి గురి చేస్తుందని అన్నారు. అలా చెప్పటం అంటే రాజ్యాంగo తెచ్చిన కల్పించిన షెడ్యూల్డ్ హక్కులను తిరస్కరించడమేనని అన్నారు. పోడు భూములకు పట్టాలు ఇస్తామని చెప్పిన కేసీఆర్ టిఆర్ఎస్ ప్రభుత్వం పట్టాల కొరకు దరఖాస్తు చేసుకోవాలని చెప్పి మరోపక్క ఫారెస్టు అధికారులను ఉసిగొలిపి పోడు భూముల అక్రమ ఆక్రమణకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఆదివాసీల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని చెబుతున్న పాలకవర్గాలు అడవి పైన ఆధారపడి జీవించే ఆదివాసీల హక్కుల గురించి మాటలే తప్ప ఆచరణలో అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. వారికి అన్ని రకాల సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యతతో పాటు ముఖ్యంగా ఆదివాసుల జీవనాధారమైన పోడు భూములకు హక్కు కల్పించి వారిని ఆదుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉందని అన్నారు. కార్పొరేట్ కంపెనీలకు సంపదను భూములను స్వాధీనం చేసుకుంటున్నారని అన్నారు. భారతదేశంలోని 5వ షెడ్యూల్ ఈ ప్రాంతంలో నివసిస్తున్న ఆదివాసీ ప్రజల బతుకులు దినదినగండంగా గడుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 2014 జూన్ 2వ తేదీని కటాఫ్ తేదీగా నిర్ణయించి పోడు భూములు సాగు చేసుకుంటున్న ఆదివాసీలందరికి వెంటనే పట్టా హక్కు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో న్యూడెమోక్రసీ సీనియర్ నాయకులు పున్నం చందు ముత్యాల సత్యనారాయణ వైఎస్ రెడ్డి బర్ల రామకృష్ణ కాంగ్రెస్ మండల కార్యదర్శి చల్లా సత్యనారాయణ ఆదివాసీ సంఘాల నాయకులు కే భద్రయ్య ఎస్ రాజు ఇడమయ్య దేవయ్య పాల్గొన్నారు.
Share it:

TS

Post A Comment: