CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

గ్రామ పంచాయతీలను సందర్శించిన స్వచ్ఛ సర్వేక్షన్ టీమ్.

Share it:

 



మన్యం మనుగడ మంగపేట.

మంగపేట మండలం లోని రాజుపేట గ్రామ పంచాయతీ ని స్వచ్ఛ సర్వేక్షన్ టీమ్ మౌనిక ఆధ్వర్యంలో సందర్శించడం జరిగింది. ఈ సందర్బంగా గ్రామ పంచాయతీ పరిధిలోని స్కూల్స్, అంగన్వాడీభవనాలు, గుడి, పల్లె ప్రకృతి వనం సందర్శించారు తదనంతరం పరిధిలో ఇంటి ఇంటికి తిరిగి ప్రజల అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు.ప్రజలను స్వచ్ఛ భారత్, పల్లె ప్రగతి గురించి అడిగి తెలుసుకున్నారు. ఊరు లోని మరుగుదొడ్లు వాటి యొక్క ఆవశ్యకత, పల్లె ప్రగతి ద్వారా పారిశుధ్యం, పరిశుభ్రత తో పాటు పచ్చదనం, ఊర్లోని బడి, గుడి, అంగన్వాడీ, గ్రామ పంచాయతీ భవనం, మార్కెట్ వంటి భవనాల్లో సైతం మరుగుదొడ్లు ఆవశ్యకత, ఊరు లోని చెత్త సేకరణ క్రమం తప్పకుండ సేకరణ ఆవశ్యకత గ్రామ పంచాయతీ ల బాధ్యత, కార్యదర్శులు విధులు, ట్రాక్టర్ సహాయం తో ప్రతి రోజు తడి పొడి చెత్త సేకరణ, కంపోస్ట్ షెడ్ ఏర్పాటు, ఇంటి నుండి వచ్చే మురుగు నీటిని ఇంకుడు గుంతల్లో కి పంపించడం, ఇంకుడు గుంతల ఆవశ్యకత, బహిరంగ మల విసర్జన నిషేధం, దోమలు, ఈగలు, విషజ్వరాలు వ్యాపించకుండా తీసుకో వలసిన జాగ్రత్తలు తదితర విషయాలు సంబందించిన అధికారులకు తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమం లో భారత్ సర్వేక్షన్ టీమ్ అధికారులు ఎంపిఓ శ్రీకాంత్, రాజుపేట గ్రామపంచాయతీ సెక్రటరీ ఉపేంద్ర, మండలం పరిధిలోని ఇతర జీపీ సెక్రటరీలు అజ్మల్, సాంబ మూర్తి, వినోద్, శ్రవణ్, ఎల్లా స్వామి, ఏయన్ యం అరుణ, సీత, అంగన్వాడీ టీచర్లు రాజేశ్వరి, విజయలక్ష్మి, జాన్షి, ఆశాలు విజయకుమారి, పుణ్యవతి,విఓసిఏ శివ పార్వతి, స్వప్న, రాజుపేట గ్రామ పంచాయతీ కారోబార్ మహేష్, సిబ్బంది, సావిత్రి, రాంబాబు, నర్సింహారావు, పౌల్, నాగేష్, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: