- రాజ్యాంగాన్ని అవమానిస్తే సహించం.
- ఏటూరు నాగారం మండల అధ్యక్షులు గండేపల్లి సత్యం.
మన్యం మనుగడ ఏటూరు నాగారం
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు గండేపల్లి సత్యం ఆధ్వర్యంలో గురువారం మండల కేంద్రంలో భీమ్ దీక్ష చేపట్టడం జరిగింది.ఈ కార్య క్రమంలో బిజెపి మండల నాయకులు జాడి రామరాజు నేత హాజరై మాట్లాడుతూ.
భారత రాజ్యాంగ బద్దంగా ఎన్నికై ముఖ్య మంత్రిగా విధులు నిర్వహిస్తున్న కెసిఆర్ భారత రాజ్యాంగాన్ని మార్చా లని అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తున్నామ న్నారు.భారత రాజ్యాంగం జోలి కొస్తే సహించ బోమని కెసిఆర్ రాష్ట్ర,దేశ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని అన్నారు.
ఎస్సీ,ఎస్టీ,బిసి,మైనార్టీలకు సమాన హక్కుల కోసం ఆత్మ గౌరవం కోసం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్,మహాత్మ జ్యోతి రావు పూలే,కొమరం భీమ్ పోరాట త్యాగాల కన్నా కెసిఆర్ మీరు గొప్ప వారా! బడుగు బలహీన వర్గాలు సమాజంలో ప్రతి ఒక్కరు సమాన హక్కుల తో బ్రతకాలని డాక్టర్ అంబేద్క ర్ చే రచించబడ్డ మన భారత రాజ్యాంగాన్ని ప్రపంచ దేశాలు కీర్తిస్తే మీరు ఇప్పుడు ఆ రాజ్యాంగాన్ని మార్చాలని అంటారా?ఈ విషయాలపై మిమ్మల్ని ప్రశ్నిస్తే బలహీన వర్గాలైన ప్రజలను కుక్కలు నక్కలు అని అంటారా?ఎంత అహంకారం మీరు తక్షణమే మాట్లాడిన మాటలు వెనక్కు తీసుకుని ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.ఇక నుండి భారత రాజ్యాంగం జోలికొస్తే ఊరుకు నేది లేదని హెచ్చరించారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడు స్తున్నా భారత రాజ్యాంగం ఇప్పటికీ ముందస్తు గానే ఉందని అన్నారు.అంబేద్కర్ ఆర్టికల్-3ను పొందుపరిచిన అందుకే తెలంగాణ ఏర్పడింద న్నారు.ఈ కార్యక్రమంలో మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ఈకమహాలక్ష్మి,
మహిళా మోర్చా మండల అధ్యక్షురాలు పలక గంగా,
యువ మోర్చా మండల అధ్యక్షులు వినుకోళ్లు చక్రవర్తి,కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు కందడి ఎలేందర్,గిరిజన మోర్చా మండల అధ్యక్షులు కొప్పుల నవీన్,కిసాన్ మండల ఉపాధ్య క్షులు ఎలుక పల్లి శ్రీనివాస్, మహిళా మోర్చా కార్యదర్శి ఆత్కూరి ప్రేమలత,గండేపల్లి రజిని తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: