- కోటి రూపాయల పారితోషికం, సొంత జిల్లాలో గృహ నిర్మాణం
- రేగా చేతుల మీదుగా ఇంటి స్థలం పర్యవేక్షణ
- హర్షం వ్యక్తం చేసిన పినపాక నియోజకవర్గ ఎంపీపీలు
మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం కూనవరం గ్రామానికి చెందిన సకిని రామచంద్రయ్య అంతరించిపోతున్న ఆదివాసి కళ "కంచు తాళం కంచు మేళం"గొప్పతనాన్ని ఖండాంతరాలకు చాటి కేంద్ర ప్రభుత్వంచే పద్మశ్రీ పురస్కారాన్ని పొందడం జరిగింది. ఈ పురస్కారంతో ఆదివాసి జాతి మొత్తాన్ని ఒక ఉన్నత స్థానానికి తీసుకెళ్లిన ఘనత రామచంద్రయ్య కే దక్కుతుంది. ఇటీవలనే తెలంగాణ ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు చే సన్మానించిన బడి, కోటి రూపాయల పారితోషికాన్ని, సొంత జిల్లాలో గృహనిర్మాణం సదుపాయాన్ని పొందడం జరిగింది. పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతారావు చొరవతో, సొంత జిల్లాలోనే ఇంటి నిర్మాణం జరుగనుంది.
ఈ సందర్భంగా పినపాక నియోజకవర్గానికి చెందిన పినపాక మండల ఎంపిపి గుమ్మడి గాంధీ, ఆళ్లపల్లి ఎంపీపీ కొండ్రు మంజు భార్గవి, కరకగూడెం ఎంపీపీ రేగా కాళికా, మణుగూరు ఎంపీపీ కారం విజయ కుమారి విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, ఆదివాసి గొప్పతనాన్ని తన కళ ద్వారా దేశానికి చాటిచెప్పిన మహోన్నత వ్యక్తి సకిని రామచంద్రయ్య అని అన్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆదివాసి జాతి తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
Post A Comment: