మన్యం టీవీ, అశ్వాపురం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ,పినపాక శాసనసభ్యులు, టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, రేగా కాంతారావు ఆదేశాల మేరకు ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం నుండి ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలని, ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణకు చట్టం తీసుకురావాలని క్యాబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకోవటం సంతోషకరమైన విషయమని, అదేవిధంగా అన్ని స్కూళ్లలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు కొరకు 7839 కోట్ల రూపాయలు విడుదల చేసిన సందర్భంగా హర్షం వ్యక్తం చేస్తూ ఈరోజు అశ్వాపురం కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మరియు ప్రాథమిక ప్రభుత్వ స్కూల్ ల ఆవరణంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కోడి అమరేందర్ మరియు పార్టీ ముఖ్య నాయకులు ఆధ్వర్యంలో గులాబీ బెలూన్స్ ను ఎగరవేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కోడి అమరేందర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు విద్యారంగంలో సమూలమైన మార్పులు చేశారని,
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థను బలోపేతం అయిందని, అన్నారు. తెలంగాణ ప్రభుత్వం విద్యా వ్యవస్థను పటిష్ట పరిచేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టడం అదేవిధంగా ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఫీజులపై చట్టం తీసుకురావటం వల్ల ప్రభుత్వ విద్య మరింత బలోపేతం అవుతుందని, ఆయన తెలిపారు. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో మరియు బీ.సి ఎస్సీ,ఎస్టీ, మైనార్టీ, గురుకులాల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగిందని, ప్రైవేట్ విద్యా సంస్థల నుండి విద్యార్థులు ప్రభుత్వ విద్యాసంస్థల్లో చేరుతున్నారని, ప్రభుత్వం తాజాగా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు పెద్ద ఎత్తున లాభం చేకూరుతుందని, అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టడం వల్ల ప్రైవేట్ విద్యా సంస్థలకు దీటుగా ప్రభుత్వ విద్య అందుబాటులోకి రానుందని, తెలిపారు.ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల విద్యార్థి లోకం అంతా హర్షణీయం ప్రకటిస్తుందని ఆయన అన్నారు. సర్కారు బడుల్లో ఇంగ్లీష్ మీడియం వచ్చే ఏడాది ప్రవేశపెట్టనున్న సందర్భంగా ఫిబ్రవరి 1వ తేదీన ఈరోజు స్కూలు ప్రారంభం అయిన నేపథ్యంలో, టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో అన్ని స్కూల్ లో గులాబీ కలర్ బెలూన్లతో అన్ని ప్రభుత్వ పాఠశాల ఎదుట ఎగురవేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కంచుగట్ల వీర వీరభద్రం టిఆర్ఎస్ సీనియర్ నాయకులు కందుల కృష్ణార్జున రావు ఈదర సత్యనారాయణ నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు వెన్న అశోక్ చిలక వెంకట్రామయ్య మండల యూత్ అధ్యక్షులు గద్దల రామకృష్ణ అశ్వాపురం ఉప సర్పంచ్ భూక్యా చందు. పాపారావు చుంచు రామ్మూర్తి సోమ్లా చింత్రియాల సర్పంచ్ పాయం భద్రయ్య నెల్లిపాక సొసైటీ డైరెక్టర్ తైదల నరసింహ రాయపూడి రాధ , యువజన నాయకులు మందా హుస్సేన్, ఈసంపల్లి పున్నారావు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: