CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఈనెల 9న జరిగే సింగరేణి హెడ్ ఆఫీస్ ధర్నాను జయప్రదం చేయండి.

Share it:

 


మన్యం మనుగడ,మణుగూరు:

 సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘాల రాష్ట్ర జేఏసీ పిలుపు.


 సింగరేణి లో పనిచేస్తున్న అన్ని విభాగాల కాంట్రాక్టు కార్మికులకు వేతనాల పెంపు ఇతర చట్టబద్ధ హక్కుల, సౌకర్యాల సాధనకై ఈనెల 9న జరిగే హెడ్ ఆఫీస్ ధర్నాను జయప్రదం చేయాలని రాష్ట్ర కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ చైర్మన్ గుత్తుల. సత్యనారాయణ సింగరేణి కాంట్రాక్టు కార్మికులను కోరారు. సోమవారం స్థానిక ఐ.ఎఫ్.టి.యు కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

          ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి లో పనిచేస్తున్న అన్ని విభాగాల కాంట్రాక్టు కార్మికులకు వేతనాలు ఇతర సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ, సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ తరఫున అనేకసార్లు యాజమాన్యానికి విన్నవించినప్పటికీ యాజమాన్యం కాంట్రాక్టు కార్మికుల సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు. అందుకే తప్పనిసరి పరిస్థితులలో ఈనెల 12వ తారీకు నుండి నిరవధిక సమ్మె చేయాలని కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ నిర్ణయించిందని అన్నారు. సమ్మె సన్నాహక కార్యక్రమంలో భాగంగా ఈనెల 9వ తారీఖున సింగరేణి హెడ్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించాలని నిర్ణయించడం జరిగిందని, ఈ ధర్నాలో సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

       ఈ సమావేశం లో రాష్ట్ర జేఏసీ నాయకులు ఎర్రగాని.కృష్ణయ్య, ఎస్కే. యాకుబ్ షావలి, ఎల్. విశ్వనాథం, వెలగపల్లి. జాన్, ఆర్. మధుసూదన్ రెడ్డి, జీ. శ్రీనివాస్, ఎండీ. గౌస్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: