CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

టీఎస్ జెన్కో జీవో నెంబర్ 62 ను రద్దు చేయాలి .తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల ఎస్సీ ఎస్టీ సంక్షేమ సంఘం డిమాండ్.

Share it:

 



మన్యం టీవీ మణుగూరు:


భద్రాద్రి ధర్మల్ పవర్ స్టేషన్, తెలంగాణ జెన్కో, ట్రాన్స్కో విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఎస్సీ,ఎస్టీ,బిసి ఉద్యోగుల ప్రమోషన్ కు సంబంధించి రిజర్వేషన్ విధానానికి వ్యతిరేకంగా జెన్కో యాజమాన్యం ప్రవేశపెట్టిన జీవో నెంబర్62 ను రద్దు చేయాలని,బిటిపిఎస్ చీఫ్ ఇంజనీర్ కార్యాలయం ఎదుట ఎస్సీ,ఎస్టీ ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో నిరసన తెలియజేయడం జరిగింది. బుధవారం నాడు నిరసన తెలిపిన సమావేశంలో ఎస్సీ,ఎస్టీ,బిసి సంఘం బి.టి.పి.ఎస్ ప్రధాన కార్యదర్శి చీలం రామకృష్ణ మాట్లాడుతూ, రాజ్యాంగం ద్వారా ఎస్సీ,ఎస్టీ, బీసీ లకు ఉద్యోగాలలో ప్రమోషన్లు రోస్టర్ విధానం ద్వారా కల్పించాలని స్పష్టంగా ఉంటే,తెలంగాణ జెన్కో యాజమాన్యం మెరిట్ కమ్ సీనియార్టీ ద్వారా ఉద్యోగ ప్రమోషన్లు కల్పిస్తుందని,దానికి అనుగుణంగానే జీవో నెంబర్ 62 ను విడుదల చేసిందని, వెంటనే ఆ జీవోను రద్దు పరచాలని,రోస్టర్ విధానం ద్వారా ప్రమోషన్లు కల్పించాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి సిద్దెల హుస్సేన్,ఇంజనీర్లు భీమ్య, చందు,రాజబాబు యశ్వంత్, కార్మికులు ప్రేమ్ ప్రకాష్, చిన్నారావు,రమేష్,సుధాకర్, భద్రకాళి,రమాదేవి తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: