- ఉచిత కంటి ఆపరేషన్లతో కంటి వెలుగులు ప్రసాధిస్తున్న ఏజెన్సీ బంధావుడు రేగా
- విప్ రేగా కు కృతజ్ఞతలు
- చిరమల్ల సర్పంచ్ పాయం నర్సింహ రావు
మన్యం టీవి న్యూస్,కరకగూడెం:
టీఆరెస్ పార్టీ నూతన జిల్లా అధ్యక్షులు, విప్,పినపాక ఎమ్మెల్యే శ్ రేగా కాంతారావు పర్యవేక్షణ లో పినపాక నియోజకవర్గ వ్యాప్తంగా 500మంది నిరుపేదలకు ఉచిత కంటి ఆపరేషన్లు చేయించిన విప్ రేగా కాంతారావు పేదల పెన్నిధి అని చిరమల్ల సర్పంచ్ పాయం నర్సింహారావు అన్నారు.రేగా విష్ణు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విజవంతం గా పినపాక నియోజకవర్గంలో ని 500 మంది నిరుపేద లకు కి లక్షల రూపాయలు వెచ్చించి ఉచిత కంటి ఆపరేషన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భం...అలాగే చిరమల్ల పంచాయతీ కి చెందిన 5గురు వృద్దులు విష్ణు మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఉచిత కంటి ఆపరేషన్లు చేయించుకున్నారు. వారిని చిరమల్ల సర్పంచ్ పాయం నరసింహారావు బుధవారం పరామర్శించి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా విప్ రేగా కి వివిధ రకాల పూలతో 500 సంఖ్య ని అలంకరించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఊకె రామూర్తి, ఇర్ప సాంబ శివ రావు,చందా ఉమా మహేష్, మైపతి తరుణ్ , చందా వంశీ,సాయి ప్రణయ్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: