CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

గంజాయి స్మగ్లర్లు పట్టుకున్న పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్ తరలించారు.44 లక్షల విలువగల గంజాయి.

Share it:

 



  • వివరాలు వెల్లడించిన భద్రాచలం ఏఎస్పి రోహిత్ రాజు,సి ఐ దోమల రమేష్...

మన్యం టివి దుమ్ముగూడెం::

మండల పరిధిలోని చిన్ననల్లబెల్లి గ్రామంలో సుమారు 2 గంటల సమయంలో గంజాయి స్మగ్లర్లను పోలీసులు పట్టుకున్నారు. ఎస్ ఐ రవి కుమార్ సి ఆర్ పి ఎఫ్ ,స్టేషన్ సిబ్బంది తో కలిసి మంగళవారం మధ్యాహ్నం నల్లబెల్లి ప్రధాన రహదారిపై వాహనాలు తనిఖీ చేస్తుండగా భద్రాచలం వైపు నుంచి వెళ్తున్న కారును పోలీసులు ఆపడానికి ప్రయత్నించగా నంబర్ లేని కార్ పోలీసులు చూసి ఆపకుండా పారిపోయారు. వెంటనే వారిని పోలీసులు గమనించి పట్టుకుని వాహనాన్ని తనిఖీ చేశారు కార్లో 4 పార్సిల్ పోలీసులు గుర్తించి ప్రభుత్వం నిషేధిత గంజాయి ఉన్నట్టు పోలీసులు గుర్తించారు మహారాష్ట్రలోని ఔరంగాబాద్ కు చెందిన సిందంతా డొల్లే 21 ,అమెలే గోర్ధే 23 ,గుర్తించారు వీరు ఇరువురు ఆంధ్రా ,ఒడిశా నుంచి గంజాయి తీసుకుని మహారాష్ట్ర కి వెళ్తున్న సమాచారం భద్రాచలం మీదుగా మహారాష్ట్ర సరఫరా చేస్తున్నట్లు తెలియచేసారు. పోలీసులు 220 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.పట్టుబడ్డ గంజాయి విలువ సుమారు 44 లక్షల 8 వేళ రూపాయి ఉంటుంది అని పోలీసులు తెలిపారు. మరో ఇద్దరు పారిపోయారని పోలీసులు తెలియజేశారు .వీరి మీద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. ఈ కార్యక్రమంలో సి ఐ దోమల రమేష్, ఎస్ ఐ రవి కుమార్ , స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: