మన్యం టీవి: పట్టణంలోని జయభారతి హాస్పిటల్ లో ఛతీస్ గడ్ కి చెందిన ముత్తయ్య ప్రమాదవశాత్తు కాలు విరిగి ఆపరేషన్ కోసం ఆసుపత్రిలో అడ్మిట్ కావడం జరిగినది. పేషెంట్ యొక్క బ్లడ్ గ్రూప్ అరుదైన ఏ బి నెగిటివ్ బ్లడ్ గ్రూప్ కావడంతో గత మూడు రోజులుగా బ్లడ్ దొరకక పోవడం వలన తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్న సమయంలో ఏబి నెగిటివ్ బ్లడ్ కావాలని గుమ్మడి.రాజు,కొప్పుల.మురళి, యండి సిందా లను సంప్రదించగా వెంటనే స్పందించి రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ నందు భద్రాచలం పట్టణ హోంగార్డు రాఘవ అన్నయ్యతో అరుదైన ఏబి నెగిటివ్ బ్లడ్ గ్రూప్ రక్తదానం చేయించి ప్రాణాపాయ స్థితిలో ఉన్న ముత్తయ్య ను ఆదుకున్నారు..
ఈ సందర్భంగా గుమ్మడి రాజు కొప్పులు మురళి, సింథా మాట్లాడుతూ అత్యంత అరుదుగా దొరికే అరుదైన బ్లడ్ గ్రూప్ ఏబి నెగిటివ్ కలిగిన రాఘవ అన్నను అడగగానే స్పందించే రక్తదానం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. యువత విద్యార్థులు ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా రక్తదానం చేయడానికి ముందుకు రావాలని కోరారు.
Post A Comment: