CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

రేగా కృషితోనే పినపాక మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు.3 కోట్ల 82 లక్షల 80 వేల నిధులు మంజూరు చేసిన తెలంగాణ ప్రభుత్వం

Share it:

 





మరింత అభివృద్ధి చెందనున్న మారుమూల గ్రామాలు- మండల ఎంపిపి గుమ్మడి గాంధీ


పినపాక మండల పాత్రికేయుల సమావేశంలో వెల్లడించిన మండల అధ్యక్షుడు పగడాల


మన్యం మనుగడ, పినపాక :


 తెలంగాణ ప్రభుత్వ విప్ పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు కృషితో పినపాక మండలం మరింత అభివృద్ధి చెందనుందని, టిఆర్ఎస్ పార్టీ పినపాక మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి అన్నారు. గురువారం నాడు ఏడూళ్ల బయ్యారం క్రాస్ రోడ్ లోని టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎమ్మెల్యే రేగా కాంతారావు కృషితో పినపాక మండలం లో ఎంపీపీ నిధుల నుండి (69.80 వేలు) రెండు ఆర్ అండ్ బి రోడ్లకు మరమ్మతులు , ఎన్ఆర్ఇజిఎస్ నిధుల నుండి రేగా కాంతారావు ప్రత్యేక చొరవతో జానంపేట ఆర్ అండ్ బి రోడ్డు నుండి అమరారం ఊరి చివర వరకు (3 కి మీ) 1.58 లక్షల రూపాయల వ్యయంతో బీటీ రోడ్డు నిర్మాణం జరుగనుంది అని, పినపాక ఆర్ అండ్ బి రోడ్ మారేడు గూడెం గ్రామంలోకి 35 లక్షల రూపాయల వ్యయంతో 700 మీటర్ల సి సి రోడ్డు నిర్మాణం జరుగనుంది అని, ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో 23 గ్రామపంచాయతీలో 24 సిసి రోడ్లు మంజూరు అయ్యాయని, 1.20 లక్షల వ్యయంతో నిర్మాణం జరుగుతుందని తెలియజేశారు.

ఇదే కాక మండల ఎంపిపి నిధుల నుండి సి సి రోడ్డు, అంగన్వాడీ మరమత్తులు, తాగునీటి సమస్య, వాటర్ ట్యాంక్ ల ఏర్పాటు జరగనుందని తెలియజేశారు.

ఈ విధంగా మారుమూల గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తున్న పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతారావు కి, తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు పినపాక మండల ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో పినపాక మండల ఎంపిపి గుమ్మడి గాంధీ, ఆత్మ కమిటీ చైర్మన్ భద్రయ్య, ఎంపీటీసీ కాయం శేఖర్, మండల ఉపాధ్యక్షులు కటకం గణేష్, ఎస్టి సెల్ అధ్యక్షుడు గొంది నాగభూషణం, టిఆర్ఎస్ నాయకులు రాయల సత్యనారాయణ, సర్పంచులు మొగిలిపల్లి నరసింహారావు, బాడిస మహేష్, కొర్శా కృష్ణంరాజు, సునీల్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: