CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఐదు సంవత్సరాల కాలపరిమితితో బొగ్గుగని కార్మికుల వేతన ఒప్పందం గని కార్మికుల తొలి విజయం.ఓసి 2 లో జరిగిన పిట్ మీటింగ్ లో మాట్లాడిన జె బి సి సి ఐ వేజ్ బోర్డు సభ్యులు మందా నరసింహారావు సీఐటీయూ.

Share it:


మన్యం టీవీ మణుగూరు:


ఐదు సంవత్సరాల కాల పరిమితితో బొగ్గుగని కార్మికుల వేతన ఒప్పందానికి యజమాన్యాన్ని ఒప్పించడంలో జాతీయ కార్మిక సంఘాల పాత్ర కీలకమైందని, హామీలు అమలు కాకపోతే గని కార్మికులు ఆందోళనకు సిద్ధం కావాలని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ)రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేజ్ బోర్డ్ సభ్యులు మందా నరసింహారావు తెలిపారు.శనివారం ఉదయం స్థానిక ఓ సి 2 లో జరిగిన పిట్ మీటింగ్ లో కార్మికులనుద్దేశించి ఆయన మాట్లాడారు.జేబిసిసిఐ 3వ సమావేశము ఇటీవల ఢిల్లీలో జరిగిందనీ,దీనిలో యాజమాన్యం,డిపిఈ*డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్, ఎంటర్ప్రైజెస్* గైడెన్స్ పేరుతోనే అనేక ప్రతిపాదనలు పెట్టిందనీ.అందులో E1 అధికారుల బేసిక్ కంటే A1 కార్మికులకు బేసిక్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని అగ్రిమెంట్ చేసుకోవాలని,అలాగే అటెండెన్స్ బోనస్సు కొనసాగించ రాదనే ప్రతిపాదనలు యూనియన్ల ముందు మేనేజ్మెంట్ తరఫున ప్రతిపాదించారనీ.దీనితోపాటు దేశంలో దాదాపు 90 శాతం ప్రభుత్వ రంగ సంస్థలకు 10 సంవత్సరాల కాలపరిమితి తోనే అగ్రిమెంటు జరుగుతున్నాయి,కాబట్టి మన బొగ్గు పరిశ్రమకు కూడా పది సంవత్సరాలు ఉండాలని, అలాగే ఈసిఎల్,బిసిసిఎల్ లాంటి కోల్ ఇండియాలోని సబ్సిడరీ కంపెనీలు నష్టాల్లో నడుస్తున్నందున వాటిని దృష్టిలో పెట్టుకొని అగ్రిమెంట్ చేసుకోవాలని,అలాగే ఈ వేతన ఒప్పందం 5% నుండి 25% వరకు పెంచితే ఎంత భారం పడుతుందో లెక్కలతో సహా వివరించింది.దీనిపై నాలుగు జాతీయ సంఘాలు ఎట్టి పరిస్థితిలో 10 సంవత్సరాల వేతన ఒప్పందాన్ని ఒప్పుకునే పరిస్థితే లేదని కేవలం ఐదు సంవత్సరాలు దృష్టిలో పెట్టుకొని మా యొక్క డిమాండ్ లను మేనేజ్ మెంట్ కు సమర్పించడం జరిగిందనీ ఎట్టి పరిస్థితుల్లో పది సంవత్సరాలు ఒప్పుకునే ప్రసక్తే లేదని అన్ని యూనియన్ల ఐక్యంగా తెలియజేశాయన్నారు.దీంతో చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడిందనీ .ఈ అంశంపై యాజమాన్యం ప్రత్యేక సమావేశంలో పునరాలోచించుకోని,యూనియన్ల ప్రతిపాదనను సమావేశంలో అంగీకరిస్తూ, ఐదు సంవత్సరాలకి జే బిసిసిఐ చర్చలు జరుపాలనే నిర్ణయాన్ని తెలియజేశారనీ అన్నారు. దీనిని కార్మికుల విజయంగా యూనియన్ల ఐక్యతతో సాధించి నట్లుగా మంద నరసింహారావు తెలియజేశారు. తదుపరి చర్చను కొనసాగిస్తూ, యజమాన్యం మొత్తం చర్చలన్నీ ఐదు విభాగాలుగా అందులో కొన్ని అంశాలను కార్మికులకు తెలియజేశారు. బొగ్గుల సంరక్షణకై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు అనుబంధ సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం టీబీజీకేఎస్ ఇప్పటికైనా ఆందోళనల బాట పట్టడం,శుభపరిణామమన్నారు.ఈ కార్యక్రమంలో ఏరియా సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు బ్రాంచ్ కార్యదర్శి వి.వెంకట రత్నం, బ్రాంచ్ నాయకులు నందం. ఈశ్వరరావు,వై.రామ్మూర్తి,ఎం లక్ష్మణరావు,ఎన్.విల్సన్ రాజు, టి లక్ష్మణ్ రావు,రామ్ భరోసి తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: